Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఇంకేం ఇంకేం కావాలి

Geeta-Govindam

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ కథానాయకుడిగా జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం కావాలి..’ అనే మెలోడియస్ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. గోపిసుందర్ అద్భుతమైన పాటలను అందించారు. అనంత శ్రీరామ్ రాసిన పాటను సిడ్ శ్రీరామ్ మధురంగా ఆలపించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బన్ని వాసు నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపిసుందర్ మంచి సంగీతాన్ని అందించాడు”అని అన్నారు. దర్శకుడు పరుశురామ్ మాట్లాడుతూ “ప్రస్తుతం సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం”అని పేర్కొన్నారు.

Comments

comments