Home తాజా వార్తలు ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

ARMY

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం అనంత్‌నాగ్‌లోని కొకేర్ వద్ద శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భవంతిలో నక్కిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్పులు జరపడంతో ఉగ్రవాది హతమయ్యాడు. ఇంకా ఆప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.  భవంతి లో ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులకు జరుపుతున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించినట్టు సమాచారం.