Home తాజా వార్తలు భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం

Encounter-News

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. ముష్కరులు, సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. హతమైన ఉగ్రవాది కిఫాయత్ గా గుర్తించారు. దాక్కున్న మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.