Search
Wednesday 21 November 2018
  • :
  • :

నేడు ప్రపంచవ్యాప్తంగా వన్ ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్ విడుదల

oneplus

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 6టి ని ఈ రోజు విడుదల చేయనుంది. అక్టోబర్ 30(మంగళవారం)వ తేదీన వన్ ప్లస్ 6టిని ముందుగా విడుదల చేయాలని భావించారు. అయితే అదే రోజు రాత్రి యాపిల్ ఈవెంట్ ఉండడంతో వన్ ప్లస్ తన ఫోన్ లాంచింగ్ ఈవెంట్‌ను ఒక రోజు ముందుకు మార్చికుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 8.30 గంటలకు వన్‌ప్లస్ 6టి ఫోన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయనుంది. న్యూయార్క్‌లో జరిగే సమయానికే భారత్‌లోని న్యూఢిల్లీలోనూ వన్‌ప్లస్ 6టి లాంచింగ్ ఈవెంట్‌ను ఏక కాలంలో నిర్వహించనున్నారు.

వన్‌ప్లస్ 6టి ఫీచర్స్:

6.4 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో కలవు.

OnePlus 6T smartphone released worldwide today

Comments

comments