Home వరంగల్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులతో ఒకరి ఆత్మహత్య

రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులతో ఒకరి ఆత్మహత్య

farmer-suicideరియల్ వ్యాపారుల మోసంతో విసిగిపోయిన రైతు
పట్టించుకోని అధికారులు, గత ఇరువై సంవత్సరాల నుండి నరకయాతన

భీమారం: గత ఇరువై సంవత్సరాల క్రితం ఒక రైతు నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల ఆ గ్రామంలో రింగ్‌రోడ్డు రావడంతో ఒక్కసారి ఆ ప్రాంతంలో ఎకరాకు కోటి రూపాయల ధర పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలోని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను అమాయకపు రైతు భూమిపై పడింది. ఇరువై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి నుండి బయటకు పంపి నిలువ నీడ లేకుండా చేశారు. దీంతో ఆ రైతు హసన్‌పర్తి తహసీల్దార్, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. కానీ ఎలాంటి ఫలితం లేదు . దీంతో చివరకు నిరాశ చెంది తన చావుతో సమస్య పరిష్కారం అవుతుందిని భావించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేటలో ఆదివారం చోటు చేసుకుంది.

స్దానికుల కధనం ప్రకారం వివరాలు…
దేవన్నపేటకు చెందిన మేరగు రాజయ్య అదే గ్రామంలోని యేన్నపు రెడ్డి తిరుపతిరెడ్డి అనే రైతు దగ్గర సుమారు ఇరువై సంవత్సరాల క్రితం నాలుగు ఎకరాల భూమి కోనుగోలు కాని రెవిన్యూ రికార్డులో పేరుమార్చుకోలేదు. గత ఇరువై సంవత్సరాలుగా తను కోనుగోలు చేసిన భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. చదువు లేకపోవడంతో రెవిన్యూ రికార్డులో పేరు మార్చుకోలేదు. కాని ఇటివల అ ప్రాంతంనుండి రింగ్ రోడ్డు పోతుడంతో అభూమికి ఎకరాకు కోటి రూపాయాల ధర పలుకుంది. దీంతో రాజయ్యను భూమిమిదకు వేళ్లకుండా కట్రచేశారు. గత రెండు సంవత్సరాలుగా అధికారులు, తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగాడు. కాని అతని పని కాలేదు.

శనివారం రోజు గోడవ..
రాజయ్య అత్మహత్య చేసుకునే ముందు రోజు దేవన్నపేటలో పట్టాదారు తిరుపతిరెడ్డితో గోడవ జరిగింది. సుమారు. యబై లక్షల రూపాలు ఇస్తే భూమి వోదులుతాం అన్ని చేప్పారు. గ్రామంలో పలు మార్లు పంచాయతీలు జరిగాయి. పేద్దమనుష్యలు పంచాయతీలు కుడా చేశారు.కాని రాజయ్యకు న్యాయం .జరగలేదు.దీంతో విరక్తి చేంది రాజయ్య అత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు హసన్‌పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.