Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కన్నీళ్ళు తెప్పిస్తున్న ఉల్లి

2NRPT3మహబూబ్‌నగర్‌ః ఉల్లి లేని కూర ఒప్పదు రుచులకు అన్ననానుడి సామాన్య ప్రజలకు ఆ ఉల్లి అందకుండా పోతోంది. ఈసారి వర్షాలు లేక ,బోరుబావుల కింద సాగు చేసిన పంట కరెంటు సమస్యతో సరిగ్గా దిగుబడి కాక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దాంతో ఉల్లి దిగుబడి తగ్గిపోయి ధరలు విపరీతంగా పెరగడంతో సామన్య, మధ్య తరగతి ప్రజలు కూరగాయల్లో ఉల్లిని వాడేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది అంటున్నారు. .ఉల్లి కొన కుండానే ఆ ధరలు చూసి కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నది. ఏ కూరగాయ వండాలన్నా కనీసం చారు లేదా చెట్ని చేసుకొని మూడు ముద్దలు తిందామన్నా ఉల్లి వాడకం తప్పని సరి. కాని అలాంటి ఉల్లిని నేడు కొనే పరిస్థితిలేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నమని ఆరోపిస్తున్నారు.

Comments

comments