Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఆన్‌లైన్ జేబుకు పెరిగిన రద్దీ…

Online-Paymentదేశంలో తీసుకున్న సంచలనాత్మక 500,1000 నోట్ల రద్దు నిర్ణయం కొందరికి మోదం కాగా మరికొందరికి ఖేదంగా మారింది. ప్రతి పౌరుడు ఏదో ఒక సమయంలో బ్యాంక్‌లో పడిగాపులు పడాల్సివస్తున్నదన్నది వాస్తవం.క్రెడిట్/డెబిట్ కార్డ్ ఉన్న ఖాతాదారులు మరియు ఆన్‌లైన్ కొనుగోలుదారులు వారి కొనుగోళ్ళను ఆన్‌లైన్ ద్వారా చేసుకుంటున్నారు. దీంతో ఈ ఆన్‌లైన్ వ్యాలెట్ సదుపాయాన్ని కల్పించే కంపెనీలకు ఒక్కరాత్రితో రద్దీ పెరిగిపోయింది. ఈ కంపెనీల సిఇవొలందరూ ప్రధాని మోదీ నిర్ణయాన్ని ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. వీటిల్లో ఒకటైన payTM సంస్థకు వాడకందారుల సంఖ్య ఉన్నపళంగా 435 శాతం పెరిగింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవారి సంఖ్య కూడా 200 శాతం పెరిగింది. బ్యాంక్‌లకు సెలవు రావడం మరియు ఉన్న A T M లు పనిచేయకపోవడం అనేది ఆన్‌లైన్ వ్యాలెట్ సేవలందించే సంస్థలకు వరంగా మారింది. ఈ సేవలకింది ఖాతాదారులు ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం నుండి క్యాబ్‌ను బుక్ చేయడానికి ఆఖరికి ఇంటికి కావల్సిన నిత్యావసరాలను ఆర్డర్ చేయడానికి కూడా ఆన్‌లైన్ పేమెంట్ సేవలను వినియోగించుకుంటున్నారు. A T M నుండి పొందే డబ్బుకు పరిమితి విధించడంతో తరచూ ప్రయాణాలు చేసేవారు చేతిలో డబ్బుల్లేక/ ఉన్న కాస్త డబ్బును ఖర్చుచేయడానికి ఇష్టపడక ఈ సంస్థల సేవలపై ఆధారపడుతున్నారు.రిక్షాలో వెళితే డబ్బులివ్వాల్సివస్తుందని ఆన్‌లైన్ పేమెంట్ చేసే అవకాశం ఉన్న క్యాబ్‌ను బుక్‌చేసుకుంటున్నారు.  ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం payTM,  mobiKwik, ఓలా క్యాబ్స్ వంటి సంస్థలకు కొత్త కష్టమర్లను తెచ్చిపెట్టగా,క్యాష్ ఆన్ డెలివరీ వెబ్‌సైట్లైన స్విగ్గీ,జమాటో,అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు కష్టమర్లను కోల్పోయి వెలవెలబోతున్నాయి.

Comments

comments