Home లైఫ్ స్టైల్ ఆన్‌లైన్ షాపింగ్ ఇబ్బందులా..?

ఆన్‌లైన్ షాపింగ్ ఇబ్బందులా..?

Online shopping is troublesome

 

ఆన్‌లైన్ షాపింగ్ ఇబ్బందులా..?
ఈ మధ్య చాలా మంది మార్కెట్‌కు వెళ్లి వస్తువులను కొనడం కంటే ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గుచూపుతున్నారు. ఒక్కోసారి ఆన్‌లైన్ దుస్తులు, పాదరక్షల విషయంలో చాలామందికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆర్డర్ చేసిన దానికి చేతికందిన దానికి తేడా కనిపిస్తుంది. కొన్నిసార్లు రంగులు, సైజులు మారిపోతాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. షాపింగ్ సులువౌతుంది.
రంగుల ఎంపికలో తికమక : ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేటప్పుడు ఆర్డర్ ఇచ్చిన రంగు ఒకటయితే, తీరా చేతికొచ్చేది మరో రంగు. మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్ స్క్రీన్‌లో చూసినప్పుడు ఆ దుస్తులు నిజమైన రంగుకు భిన్నంగా కనిపించటమే దానికి కారణం. మీకు నచ్చిన రంగునే ఎంచుకోవాలనుకుంటే మాత్రం ముందు దుస్తుల రంగుల గురించి కొంత అవగాహన ఉండితీరాలి. కొన్ని దుస్తులు ఒరిజినల్‌గా చూసిన దానికి భిన్నంగా ఫొటోల్లో కనిపిస్తాయి. ముదురు రంగుల్లో ఉన్న దుస్తులు ఫొటోల్లో డల్‌గా కనిపిస్తాయి. కాంతిమంతంగా ఉండే రంగులు మరింత కాంతిమంతంగా కనిపిస్తాయి.
సైజ్ తెలిస్తే సరైన ఉత్పత్తి : ఆన్‌లైన్‌లో నచ్చిన దుస్తులు, పాదరక్షలను ఆర్డర్ చేసేముందు కొలతలను సరి చూసుకోవాలి. అవసరమైతే టైలర్ సహాయం తీసుకోవాలి. తీసుకొన్న కొలతల ప్రకారం మన ఆర్డర్‌ను రివ్యూ చేసి ఎడిట్ చేయాలి. చాలాసార్లు ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారు సైజ్‌చార్ట్‌లను పట్టించుకోరు. అన్ని వెబ్‌సైట్‌లలో కొలతల ప్రమాణాలు ఒకేలా ఉండవు. కాబట్టి తప్పనిసరిగా సైజ్‌చారట్స్‌లోకి వెళ్లి కొలతలు మళ్లీ ఒక్కసారి చూసుకోవాలి.
సైజ్‌లను సరిపోల్చడం: బ్రాండ్‌ను బట్టి కూడా సైజ్‌లు మారతాయి. చాలా బ్రాండ్‌లకు వాటి సొంత సైజ్ చార్ట్‌లు ఉంటాయి. ఛాతీ, నడుము కొలతలు ఉన్న నోట్‌ను దగ్గర ఉంచుకోవాలి. మీ శరీర కొలతలు మీరు కొనాలనుకున్న బ్రాండ్ తాలూకు ఉత్పత్తలతో మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆన్‌లైన్‌లో కొన్నా దుస్తులు ఫిట్‌గా ఉంటాయి. ఒకవేళ అదీ సెట్ కాకుంటే వాపసు ఇచ్చేయడం మంచిది.

 

Online shopping is troublesome