Home స్కోర్ బాధ్యత అశ్విన్ ఒక్కడిదే కాదు: జడేజా

బాధ్యత అశ్విన్ ఒక్కడిదే కాదు: జడేజా

ashwin-and-jadejaరాజ్‌కోట్: టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరో ఆటగాడు రవీంద్ర జడేజా మద్దతుగా నిలిచాడు. భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న తొలిటెస్టులో పర్యాటక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 46 ఓవర్లు వేసి 167 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడి బౌలింగ్‌పై పలువురు విమర్శలు గుప్పించడాన్ని జడేజా తప్పుపట్టాడు. ‘జట్టులో మొత్తం ఐదుగురు బౌలర్లం ఉన్నాం. వికెట్లు తీసే బాధ్యత అందరికీ ఉంది. అది కేవలం ఒక్క అశ్విన్‌ది మాత్రమే కాదు. కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అది ఆటలో ఓ భాగం. ప్రతీ ఒక్కరికీ సమానంగా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.