Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

దీర్ఘకాలంలో మిగిలేవి ఆ ఐదు బ్యాంకులే..

  • కోటక్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్

Uday-Kotak

న్యూఢిల్లీ : ఆర్థిక సేవల రంగంలో బలమైన ఏకీకర ణకు అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయంగా జరిగే పరిణామాలతో చివరికి ఐదు బ్యాంకులు మాత్రమే మిగులుతాయని కోటక్ బ్యాంక్ ఎండి ఉదయ్ కోటక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా చాలా దేశాల్లో మూడు నుంచి ఐదు బ్యాంకుల అధిపత్యమే ఉంటుందని ఓ ఇంట ర్వూ సందర్భంగా ఆయన అన్నారు. కొన్ని సం స్థల ఆధిపత్యం కల్గిన గ్లోబల్ ట్రెండ్‌లో భారత్‌కు మినహాయింపేమీ ఉండదని అన్నారు. అయితే ఏ బ్యాంకులు దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఆధిప త్యం చెలాయిస్తాయనే ప్రశ్నలకు కోటక్ సమాధాన మిచ్చేందుకు నిరాకరించారు. అయితే వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటని మాత్రం చెప్పారు. మిగతావి ఏ బ్యాంకులనేవి చెప్పలేదు. ఆఖరికి కొన్ని బ్యాంకులు మాత్రమే మిగులుతాయ ని, ఎస్‌బిఐ మాత్రం ఒకటని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒక టిగా చోటు దక్కించుకుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనెర్ అండ్ జైపూర్(ఎస్‌బిబిజె), స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బిహెచ్), స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్(ఎస్‌బిఎం), స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియా లా(ఎస్‌బిపి), స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్(ఎస్ బిటి)లను విలీనం చేసుకుంటున్నట్టు ఎస్‌బిఐ శనివారం ప్రకటించింది. భారతీయ మహిళా బ్యాంకు విలీనాన్ని ప్రభుత్వం అంతకముందే చేపట్టింది. ఈ విలీనంతో ఆస్తుల పరంగా టాప్-50 గ్లోబల్ బ్యాంక్‌లలో ఒకటిగా చోటు దక్కించు కోబోతున్నామని వెల్లడించింది. ఈ ప్రక్రియతో 37 కోట్ల కస్టమర్లు, దాదాపు 24వేల బ్రాంచులను.. 59వేల ఎటిఎంలు తన సొంతం కానున్నాయని పే ర్కొంది. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసిఐసిఐ కంటే ఐ దు రెట్లు పెద్ద బ్యాంకుగా ఎస్‌బిఐ అవతరిస్తోంది.

Comments

comments