Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

నోట్ల రద్దు ఎఫెక్ట్: థియేటర్ లో సినిమా చూసిన ఒకే ఒక్కడు

Theatres-without-people

పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ దేశంలో ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనం ఇదే. పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఈ సంఘటనను చెప్పుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య జనాలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు.

నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి, ఆఫీసులకు వెళ్లడానికి, బస్సుల్లో తిరగడానికి, బయటికెళ్లి పనులు చేసుకోవడానికి కూడా చిల్లర లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

చిల్లర సమస్య చివరకు కొంత ప్రాణాలను కూడా తీసింది. ఇక, ఈ నోట్ల రద్దు ఎఫెక్ట్ సినిమా థియేటర్లకూ పాకింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్, వైన్ షాప్స్ కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి.

అయితే, గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని ఓ సినిమా హాల్ లో ఒక్కడంటే ఒక్కడే వచ్చాడట సినిమా చూడటానికి. ఏం చేయాలో తెలియని సినిమా హాల్ యాజమాన్యం..షో ను రద్దు చేయకుండా ఆ ఒక్కడికే సిినిమా ను ప్రదర్శించిందట.

Comments

comments