Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అరుదైన పుష్పం

flower-image

వసంతకాలంలో పూసే ట్రిలియమ్ అనే పేరుగల పుష్పాలు ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటి రెక్కలు ప్రకాశవంతంగా, ముదురురంగుల్లో ఉంటాయి. ట్రిలియం పువ్వును పొరపాటుగా కూడా తెంచకూడదు. తిరిగి దీన్ని పూయించడానికి సంవత్సరాలు పడుతుంది. మిచినాన్‌చ మెన్నెసోటా, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో ట్రిలియం చెట్టును కాపాడటానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. అంతరించిపోతున్న వృక్ష జాతుల కోసం ఇవి ఏర్పాటు చేశారు. ఒంటరిగా వదిలేసినప్పుడు కొన్ని మొక్కలు పాతికేళ్లవరకు జీవించగలవు.

ఒకవేళ ఇంట్లో పెంచుకోవాలనుకుంటే మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇది విషంతో కూడి ఉంటుంది. ట్రిలియమ్ అనేది ఓ సెన్సిటివ్ ప్లాంట్. ఇది అండర్‌గ్రౌండ్ రైజోమ్స్‌ను వెదజల్లుతోంది. ప్రతి మొక్కకి ఒకటి లేదా రెండు పుష్పాలు మాత్రమే పూస్తాయి. కొన్ని రకాల ట్రిలియమ్ మొక్కలను ఔషధాల్లో వాడతారు. యూరిన్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. అందుకనే వీటికి బర్త్‌వార్ట్ అని పేరు. ఎర్ర ట్రిలియమ్ అనే దాన్ని స్టిన్‌కింగ్ బెంజిమన్ అని అంటారు. అవి ఎక్కువగా దుర్గంధాన్ని కలిగి ఉంటాయి. తెల్ల ట్రిలియమ్‌ను ఓహియో అంటారు. కెనడాలోని ఒన్‌టారియోకి జాతీయపుష్పం.

Comments

comments