Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఊపిరి మూవీ రివ్యూ…

Oopiri-images-done-in-ptsటైటిల్ : ఊపిరి
థీమ్ : ఎమోషనల్ డ్రామా
తారాగణం :  నాగార్జున, కార్తీ,. తమన్నా, ప్రకాష్ రాజ్
సంగీతం : గోపి సుందర్
మాటలు : అబ్బూరి రవి
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాత : ప్రసాద్ పొట్లూరి

మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి వరుస సూపర్ హిట్స్ తర్వాత ఊపిరి మూవీలో నటించిన సినిమా కింగ్ నాగార్జునకు హ్యాట్రిక్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ మూవీ ‘ద ఇంటచబుల్స్ ’ సినిమాకు అధికారిక రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున మొత్తం వీల్ చైర్‌కే పరిమతమయ్యే పాత్రలో కనిపించాడు. మన్మథుడి ఇమేజ్ వున్న నాగ్ వీల్ చైర్‌లోనే వుండే పాత్రలో కనిపిస్తుండటం,తొలిసారిగా తమిళ హిరో కార్తీ నేరుగా తెలుగు సినిమా చేస్తుండటంతో ఊపిరిపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి సోగ్గాడిగా మాస్ ఆడియన్స్‌ను ఊర్రుతలూగించిన నాగ్, వీల్ చైర్‌లో కూర్చొని ఎంత వరకు ఎంటర్‌టైన్ చేశాడు..? తొలిసారిగా తెలుగు సినిమా చేసిన కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించాడు..? దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్రెంచ్ కథతో తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించాడు..? అనేది సస్పెన్స్ అయితే

కథ : శీను (కార్తీ) అల్లరి చిల్లరిగా తిరుగుతూ డబ్బు కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అలా దొంగతనం చేస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడి జైలుకెళ్తాడు. పెరోల్ మీఈద బయటకు వచ్చిన శీనుని తల్లి (జయసుధ) ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వాడిగా చూపించుకొని కేసునుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తాడు. అందుకోసం అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పని చేయడానికి ప్రయత్నించినా అది కుదరదు. దీంతో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య (నాగార్జున)కు కేర్‌టేకర్ కోసం జరుగుతున్న ఇంటర్వూకు వెళ్తాడు. అక్కడ విక్రమాదిత్య…సెక్రటరీ కీర్తి (తమన్నా)ని చూసి ఎలాగైనా అక్కడే ఉద్యోగంం చేయాలని నిర్ణయించుకుంటాడు. విక్రమాదిత్య..ఎన్నో బిజినెస్‌లు వున్న ఓ భారీ వ్యాపారవేత్త. పారిస్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఓ యాక్సిడెంట్‌లో మయెడ కింద నుంచి శరీరమంతా పనిచేయకుండా పోతుంది. దీంతో ప్రతి పనిరకి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. తనకు తోడుగా ఫ్రెండ్ (ప్రకాష్‌రాజ్), సెక్రటరీ కీర్తి ఉన్నా ఇంకా ఏదో మిస్ అవుతుంటాడు విక్రమాదిత్య అలాంటి సమయంలో తనను ప్రేమగా చూసుకునే వ్యక్తి కోసం ఇంటర్వూ ఏర్పాటు చేస్తాడు. అనుకోకుండా అక్కడకు వచ్చిన శీను మాట తీరు నచ్చి అతన్నే తన కేర్ టేకర్‌గా తీసుకుంటాడు ఎలాంటి బాధ్యత తెలియని శీను ని ఎలాంటి ప్రయాత్నాలు చేశాడు..? శీను జీవితంలో సమస్యలను విక్రమాదిత్యెలా పరిష్కరించాడు అన్నదే మిగతా

నటీనటుల నటన : తెలుగు సీని రంగంలో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో చేయని సాహసం చేసిన నాగ్ మరోసారి బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా లాంటి మాస్ ఎంటర్‌టైనర్ తర్వాత ఊపిరి సనిమా చేసిన నాగ్, తన నమ్మకం వమ్ముకాదని ప్రూవ్ చేసుకున్నాడు. ఎలాంటి బాడీలాంగ్వేజ్ లేకపోయినా కేవలం హావాభావాలతో అద్భుతమైన ఎమోషన్స్ పండించాడు. ఇక తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కార్తీ తెలుగబ్బాయే అనేంతగా ఆకట్టుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్‌ను రెండు వెరియషన్స్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్, స్లైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది..మిల్కీ బ్యూటీ తమన్నా ..నాగార్జున ఫ్రెండ్‌గా ప్రకాష్‌రాజ్ తనదైన నటనతో మెప్పించాడు. అలీ , జయసుధ, గ్యాబ్రియల్ తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక అతిథి పాత్రల్లో అలరించిన అనుష్క, శ్రియ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేశారు.

ప్లస్ పాయింట్స్ :
కథ
నాగార్జున, కార్తీల నటన
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
పాటలు
సెకండ్ హాఫ్ లెంగ్త్

“ఓవరాల్‌గా ఊపిరి.. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది”

Comments

comments