Home జాతీయ వార్తలు శ్రీనగర్‌లో ఎదురుకాల్పులు

శ్రీనగర్‌లో ఎదురుకాల్పులు

armyశ్రీనగర్: ఓ వైపు దేశమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటుండగా జమ్ముకశ్మీర్‌లో మాత్రం కాల్పుల మోత మోగుతూనే ఉంది. శ్రీనగర్‌లోని నౌహట్టా ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు సిఆర్‌పిఎఫ్ సైనికులు గాయపడ్డారు. కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.