Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పార్కుల్లో ఓపెన్ జిమ్‌లు

వాకర్స్ కోసం బల్దియా కసరత్తు
సుముఖత వ్యక్తం చేస్తున్న ఉన్నతాధికారులు

GYM

మన తెలంగాణ/సిటీబ్యూరో : వాకర్స్ కోసం పార్కులలో జిమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. పార్కులలో ఒపెన్ జిమ్‌లు ఏర్పాటు చేయాలని మహానగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి) నిర్ణయించింది. ఈ ఒపెన్ జిమ్‌లను పార్కు ల్లో ఏర్పాటు చేయడం ద్వారా ఆహ్లదపురితమైన వాతావర ణంలో వ్యామం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నగరంలో రిడింగ్‌రూమ్‌లలో ఇప్పటికే జిహెచ్‌ఎంసి జిమ్‌ల ను నిర్వహిస్తుంది. జిహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన జిమ్‌లను స్థానిక యువత, వ్యక్తులు వినియోగించుకుంటున్నారు.

ఇటీవల ఆధునికమైన జిమ్‌లను నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిమ్‌లను నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబాఫసి యోద్దీన్‌లు పలు ప్రాంతాల్లో ప్రారంభించారు. జిహెచ్‌ఎంసి క్రిడాల విభాగం ఈ జిమ్‌లను నిర్వహిస్తుంది. నగరంలో వందల సంఖ్యలో జిహెచ్‌ఎంసికి చెందిన జిమ్‌లు ఉన్నా యి. ఈ జిమ్‌లను స్థానిక యువజన, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల నిర్వహణలో కొనసాగుతున్నాయి. కమ్యూనిటీ హాళ్లలో ఇప్పటి వరకు జిమ్‌లను ఏర్పాటు చేస్తూ వస్తున్నా రు. అయితే పార్కుల్లో వాకర్స్ కోసం జిమ్‌లను ఏర్పాటు చేయాలని పలు ప్రాంతాల నుంచి జిహెచ్‌ఎంసికి వినతులు అందుతున్నాయి.

వాకర్స్ విజ్ఞప్తి మేరకు పార్కులలో ఒపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసేందుకు బల్దియా అధికారులు సన్నా హాలు ప్రారంభించారు. మొదట ప్రయోగత్మ కంగా పెద్ద పార్కులలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెద్ద పార్కు లలో సెక్యురిటి ఉంటున్నందున జిమ్‌లలో వ్యామానికి వినియోగించే సమాగ్రికి రక్షణ ఉంటుందని భావిస్తున్నారు. దశల వారీగా పార్కుల్లో ఒపెన్ జిమ్‌లను పెంచాలనే యోచనలో ఉన్నారు. ఒపెన్ జిమ్‌ల నిర్వహణ ను స్థానిక వాకర్స్ అసోసియేషన్లకు అప్పగించనున్నారు. పార్కులలో ఒపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పార్కుల ను సందర్శించినట్లు సమాచారం. పార్కులకు వచ్చే వాకర్స్ ఎంతమంది, ఉంటారు, ఒపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తే ఎంత మంది వినియోగించుకుంటారనే అంశాలను పరిశీలిస్తున్నా రు. నగరంలో ఎక్కువ సంఖ్యలో వాకర్స్ వచ్చే ప్రధాన పార్కుల్లో మొదట జిమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

Comments

comments