Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ విడుదల

Operation 2019 Theatrical Trailer Out now

హైదరాబాద్: శ్రీకాంత్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ 2019′(‘బివేర్ ఆఫ్ పబ్లిక్’ అనేది ట్యాగ్ లైన్). తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే ‘ఆపరేషన్ దుర్యోధన’ మాదిరిగానే ఈ మూవీ కూడా పోలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుందని అర్థమవుతోంది. ఇక ట్రైలర్ లో శ్రీకాంత్ చెప్పిన డైలాగ్  “గాంధీ కడుపున గాంధీ పుట్టడు .. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు .. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు .. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే” చాలా బాగుంది. చాలా కాలంగా సోలో హీరోగా విజయాలు లేని శ్రీకాంత్ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే సినిమా విడుదల కానుంది.

Comments

comments