Home ఆదిలాబాద్ ఆపరేషన్ గణేశ్

ఆపరేషన్ గణేశ్

గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
డిజెలకు అనుమతుల్లేవ్
భారీగా పోలీస్ బందోబస్తు
సిసి కెమెరాల ఏర్పాటు
ముమ్మరంగా వాహనాల తనీఖీలు
పర్యవేక్షించనున్న జిల్లా ఎస్పీ తరుణ్ జోషి

ganesh

ఆదిలాబాద్: ఆపరేషన్ గణేష్ పేరిట పోలీసులు జిల్లాలో ప్రశాంత వారణం కల్పించేందుకు భారీగా బందోబస్తు నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిఘా వర్గాలతో పాటు యాంటి సాబోటేజ్‌చెక్, బాంబు స్కాడ్‌ల తనిఖీలతో పాటు ముమ్మరంగా వాహనల తనీఖీలు చేపట్టానున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల నిర్వహకులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి సూచనలు చేస్తున్నారు. ఒకే సారి గణేష్, బక్రీద్ పండుగలు రానున్న దృశ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత చర్యలు తీసుకుంటున్నారు. గణేష్ మండల నిర్వాహకులు స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించే ముందు పోలీసుల అనుమతి తప్పని సరిగాఉండాలని, నిర్వాహకులు సంబంధిత డీఎస్పీల ద్వారా అనుమతి పొందాలని, నిర్వాహకులు ఒక కమిటీగా ఏర్పడి పోలీసు అధికారులతో సమావేశమై గణేష్ ప్రతిష్టించే స్థలాన్ని ట్రాఫిక్‌కు అంతరయం లేకుండా నిర్ణయించాలని పోలీసులు సూచిస్తున్నారు. గణేష్ కమిటీ సభ్యుల పేర్లు వివరాలు డిఎస్పీలకు అందించాల్సి ఉంటుంది. ఇందులోనే భాగంగా జిల్లా ఎస్పీ డా.తరుణ్ జోషి పోలీసులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి విద్వెశలకు తవ్వకుండా శాంతియుతంగా గణేష్ ఉత్సాలు నిర్వహించేల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శాంతి కమిటీ నిర్వహించారు.

ఈ నెల 17న వినాయక చవితి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయుటకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, నిర్మల్, భైంసా, ఉట్నూర్, ఖానాపూర్ ప్రాంతాల్లో సాయుధ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు. గణేష్ ఉత్సవాల్లో డిజేలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదు. నిబంధనాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో నిఘా వర్గాలతో పాటు యాంటి సాబోటేజ్‌చెక్, బాంబు స్కాడ్‌లతో తనిఖీలు నిర్వహించనున్నారు. ముఖ్య పట్టణాలైన ఆదిలాబద్, నిర్మల్, బైంసా, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ తదితర పట్టణాల్లో సిసి కెమెరాలను అమర్చారు. పండుగల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి రాత్రి, పగలు విసృతంగా వాహన తనిఖీలు చేయనున్నారు.
శాంతి కమిటీ సమావేశాలు
గణేష్ చతుర్థి సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా శాంతి కమిటీలు నిర్వహిస్తున్నారు. తొలుత పోలీస్ స్టేషన్ల వారీగా నిర్వహించిన అధికారులు జిల్లా కేంద్రంలో ఆయా పార్టీలు, ఆయా మతాల పెద్దలతో శాంతి కమీటి సమావేశం నిర్వహించి సూచలు, సలహాలు తీసుకున్నారు. శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరిగేలా పోలీసులు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ డా.తరుణ్ జోషి తెలిపారు.