Home తాజా వార్తలు ఆసక్తికరంగా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీజర్…

ఆసక్తికరంగా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ టీజర్…

Operation Gold Fish ఆది హీరోగా వినాయకుడు ఫేం అడివి సాయికిరణ్ రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. తాజాగా ఈ చిత్ర టీజర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. టీజర్ ని చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా విడుదలైన టీజర్ తో ఈ అంచనాలు తారస్థాయికి చేరాయి. ఈ మూవీలో ప్రముఖ రచయిత అబ్బూరి రవి ‘ఘాజీబాబా’ అనే టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. నలుగురు మిత్రలు, ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది. ఈ సినిమాలో ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెత్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ ఇతర కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Operation Gold Fish Official Teaser is Released