Home ఆదిలాబాద్ జనవరి నుంచి ‘ఆపరేషన్ ముస్కాన్’

జనవరి నుంచి ‘ఆపరేషన్ ముస్కాన్’

Muskan1

ఆదిలాబాద్‌క్రైం: బాలలను రక్షించడానికి జనవరి నెలలో ‘అపరేషన్ ముస్కాన్’ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ టి పనసారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు హెడ్ క్వాన్టర్స్‌లోని పోలీసు సమావేశ మందిరంలో బాలల రక్షణ కమిటితో సమావేశమైనారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లాలు ఏర్పాడిన అనంతరం మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ నూతన సంవత్సరంలో జనవరి 1 నుండి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుండి సిఐడి అధికారులు, స్థానిక సిసిఎస్ డిఎస్పీకే నర్సింహారెడ్డి ప్రత్యేక పరివేక్షణలో స్థానిక బాలల సంరక్షణ కమిటి సిడబ్లూసి, ఎన్‌జిఓ. చైల్డ్‌లైన్ టీమ్ సభ్యులు, ఇతర సంబంధిత అధికారులతో కలిసి నెలరోజుల పాటు రెస్కూ నిర్వహిస్తారన్నారు.

బాలల హక్కులను హరించే ఎంతటి వారైన చట్టరీత్య చర్యలు ఉంటాయన్నారు. భవన నిర్మాణం, హోటల్స్, దుకాణాలు ఇటుక భట్టిల్లో, భిక్షాటన, ఇంటి పనిమనిషులుగా తదితర చోట్ల రెస్కూ నిర్వ హించి తగిన విధంగా కౌన్సిలింగ్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బాలలు చదువుకుంటేనే దేశ భవిష్యత్తుకు రక్షణ ఉంటుందని సూచించారు. బాలల హక్కులను పరిరక్షించడం అందరి భాద్యతగా భావించాలన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లల పట్ల నిర్లక్షంగా ఉన్న వారి చెడుమార్గం అను సరించే ఆస్కారం ఉందన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆపరేషన్ ముస్కాన్‌లో 365, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో 548 బాలలను రక్షిం చామని తెలిపారు. జిల్లా ఎస్పీ యం.శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని సూ చించారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డిఎస్పీ కే.నర్సింహారెడ్డి, సిఐడి ఇన్స్‌పెక్టర్ వి.సురేష్, చైల్డ్ వెల్ఫ్‌ర్ కమిటి, చైర్మన్  అమృతరావు, సభ్యులు మ మత, ఖాజామీయా, యాకుబ్‌బేగ్, చైల్డ్‌లైన్ అధికారులు వై.సాయి కిరణ్ రాజ్, కిషోర్ కుమార్, ఇమ్రాన్‌ఖాన్, ఎన్‌జివోలు, ఎల్ సంగిత, యం.రాజు తదితరులు పాల్గొన్నారు.