Home తాజా వార్తలు పిల్లల జీవితాల్లో ‘స్మైల్’

పిల్లల జీవితాల్లో ‘స్మైల్’

Child laborపని నుంచి విముక్తి కల్పిస్తున్నారు
365 మంది బాలబాలికలకు విముక్తి
విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు
బాల కార్మికులతో పనిచేయిస్తే కఠిన చర్యలు
మూడేళ్లు శిక్ష పడే అవకాశం

హైదరాబాద్: బడిఈడు పిల్లలు పాఠశాలకు వెళ్లాలని, వారితో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న సైబరాబాద్ పోలీసులు ఆచరణలో దానిని నిజం చేస్తున్నా రు. పిల్లలకు పని నుంచి విముక్తి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పనిచేస్తున్న వారిని తీసుకువచ్చి ఉచితం గా ఆశ్రమాల్లో చేర్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. బా లలు బడిలో ఉండిలి కాని పనిప్రదేశంలో కాదని చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసులు 2018, జూన్, 18వ తేదీన ప్రారంభించి న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలు ఇస్తోంది. ఇప్పటి వరకు ఆపరేష న్ స్మైల్, షీటీమ్స్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో 365మంది బాలబాలికలను కాపాడారు.

పిల్లల అక్రమ రవాణా, భిక్షాటన, వ్యభిచార గృహాలకు విక్రయం, తప్పిపోయిన పిల్లలను కనిపెట్టడ ం తదితర వాటి కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ దూసుకుపోతోంది. చాలా మంది బాలబాలికలను వెట్టిచాకిరి నుంచి వి ముక్తి కల్పిస్తున్నారు. గత ఏడాది సైబరాబాద్ స్మైల్ టీం సభ్యులు 179మంది పిల్లలను రక్షించారు. వారిలో 69మంది చిత్తు కాగితాలు ఏరుకునేవారు, 29మంది బాలకార్మికులు ఉన్నారు. బాలికలను లైంగికంగా వేధించిన నలుగురిపై పొక్సో చట్టం కింద కే సులు నమోదు చేశారు. 2018లో వివిధ కారణాలతో తప్పిపోయిన పిల్లలు 138మందిని గుర్తించారు, వారిలో 24 మందిని వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 129మంది పిల్లల వివరాలు తెలియకపోవడంతో పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇందులో 7 ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది మార్చి, ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఆపరేషన్‌లో 91మంది పి ల్లలను కాపాడారు. వారిలో 61 మంది బాలురు, 30 మంది బాలికలు ఉన్నారు. ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో 101మంది పిల్లలకు విముక్తి కల్పించారు. వారిలో 77మంది బాలురు, 24మంది బాలికలు ఉన్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 49మంది ఉన్నారు. ఇందులో కొందరు భిక్షమెత్తుకుంటుండగా, కొందరు ఇటుక బట్టీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న వారిపై 25 కేసులు నమోదు చేశారు.

ఇటుక బట్టీల్లో ఇతర రాష్ట్రాల పిల్లలు…

ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇటుక బట్టీల్లో కార్మికులుగా పనిచేసేందుకు తెలంగాణకు రావడంతో ఎక్కువ మంది బాల కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిసా తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడి ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వస్తున్నారు. తల్లిదండ్రులు ఇటుక బట్టీల్లో పనిచేస్తుండడంతో వారి పిల్లలు కూడా అక్కడే పనిచేస్తున్నారు. వారికి ఇక్కడ పాఠశాలలు లేకపోవడం, పేదరికం, భాష రాకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులతోపాటు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. బాలకార్మికులు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారే సమాచారం రావడంతో సైబరాబాద్ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి వారికి పనినుంచి విముక్తి కల్పించి, పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ ఫిర్యాదులు…

సైబరాబాద్ పోలీసులకు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. బాల, బాలికల గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు విస్కృతంగా ప్రచారం నిర్వహించడంతో చాలా వరకు ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. ఫిర్యాదు కోసం వాట్సాప్ నంబర్ 7901115474 నంబర్‌ను ఏర్పాటు చేశాయగా, 100కు డయల్ చేయడం, మేయిల్ smileteamcyb@gmail.comకు ఫిర్యాదు చేయవచ్చు, ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే సైబరాబాద్ పోలీసులు స్పందించి బాలబాలికలకు విముక్తి కల్పిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచే పాఠశాలలకు పంపిస్తున్నారు. బాల కార్మికులతో పనిచేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు న మోదు చేస్తామని, మూ డేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చ ని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

Operation Smile, TS police rescues 365 children