Home వార్తలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఒప్పో ఎ37

ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఒప్పో ఎ37

OPPO-A37జులై1న విపణిలోకి.. ధర రూ.11,990
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆకర్షణీయమైన ఫోటోలు, డిజిటల్ అవసరాలను కోరుకునే వారి కోసం ఒప్పో వారి స్మార్ట్ ఫోన్ OPPO ఎ37 తన మరో నూతన సిరీస్ మొబైల్ ఫోన్‌ను భారత విఫణిలోకి జులై 1న విడు దల చేయనుంది. ఈ విభాగంలో అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన సాటిలేని మేటి టెక్నాలజీతో వృద్ధి పర్చబడింది. ఒప్పో ఎ 37 రెండు వర్ణాలు గోల్డ్ అండ్ గ్రేలలో లభ్యం కానుంది. అన్నింటికీ మించి వృత్తినైపుణ్య ఫొటోగ్రఫీ మోడ్స్ ఉన్నందున ఆకర్షణీయమైన ఫోటోల ను చాలా తేలికగా తీయగలదు. ప్రత్యేకతను కోరుకునే వారికి, నాజూకు చరవాణిలో ఉత్తమ శ్రేణి ఫోటోలను సొంతం చేసుకోవాలనుకునే వారికి OPPO ఎ 37 సరి గ్గా సూటవుతుందని ఒప్పొ మొబైల్స్ హైదరాబాద్ పిఆర్‌ఒ సందీప్ చౌడోజు ఒక ప్రకటనలో తెలిపారు. నేటి యువతలో ఉన్న సెల్పీ క్రేజీని దృష్టిలో ఉంచుకుని ఫోటోలు ఫ్రంట్ కెమెరా 5 మెగా ఫిక్సెల్, బ్యాక్ కెమెరా 8 మెగా ఫిక్సెల్ ఉండడంతో వెలుతురు లేని ప్రదేశాల్లోనూ చక్కని ఫొటోలను ఈ మొబైల్ తీయగలదన్నారు. బ్యాక్ కెమెరా 8 మెగా ఫిక్సెల్ కల్గి ఉన్నప్పటికీ 24 మెగా ఫిక్సెల్ స్థాయిలో ఫోటోలను డిజిటలీకరణ చేయగలదన్నారు. లగ్జరీ డైనమిక్ లుక్‌ను కల్గి ఉండడంతో పాటు డిస్‌ప్లే 5 ఇంచులు దాన్ని కవర్ చేస్తూ 2.5 D కార్మింగ్ గొరిల్లా గ్లాస్ -4తో మరింత లగ్జరీ టచప్‌ను ఇవ్వనుందన్నారు. ముఖ్యంగా 2 GB ర్యాం, క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్ కారణంగా ఈ మొబైల్ మరింత స్పీడైన పనితీరును కనబరుస్తుంది. అంతే కాకుండా 16 GB ఫోన్ ఇంటర్‌నల్ మెమోరి ఉండడంతో పాటు 128 GB వరకు ఎక్స్‌టర్నల్ మెమెరీగా పెంచుకునే సదుపాయం ఉంది.