Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఒప్పో ఎ3ఎస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

OPPO-IMAGE

ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ3ఎస్ ను తాజాగా రిలీజ్ చేసింది. రూ.10,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన రెండు కెమెరాలను, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం డెడికేటెడ్ స్లాట్‌ కూడా లభిస్తోంది. ఈ ఫోన్‌లో 4230 ఎంఎహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని అమర్చారు.

ఒప్పో ఎ3ఎస్ అద్భుత ఫీచర్లు…

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

2 జిబి ర్యామ్, 16 జిబి ర్యామ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments