ముంబయి: ప్రముఖ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన ఎఫ్7 స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్కు చెందిన 4జిబి ర్యామ్ వేరియెంట్ ధర రూ.21,990 ఉండగా అది తగ్గి రూ.19,990 కి చేరింది. ఇదే ఫోన్కు చెందిన 6 జిబి ర్యామ్ వేరియెంట్ ధర రూ.3వేలు తగ్గింది. రూ.26,990 గా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇప్పుడు రూ.23,990కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఒప్పో ఎఫ్7 ఫీచర్లు…
6.23 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్,
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
4జి వివొఎల్టిఇ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.