Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఒప్పో నుంచి ఎఫ్3 ప్లస్

Oppo-F3-Plus

న్యూఢిల్లీ : చైనాకు చెందిన ఒప్పో తాజాగా కొత్త డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఎఫ్3 ప్లస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్‌తో పాటు ఇండోనేషియా, మయన్మార్, పిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాల్లో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టినట్టు కంపెనీ వెల్లడించింది. ఒప్పొ ఎఫ్3 ప్లస్ ధర రూ.30,990, ఏప్రిల్ 1 నుంచి విక్రయాలు షురూ అవుతాయి. ముందస్తు ఆర్డర్‌ను గురువారం నుంచి ప్రారంభించగా, మార్చి 31 నాటికి అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్ మార్కెట్‌లో లభ్యం కానుంది. ఒప్పొ ఎఫ్3 సిరీస్‌లోని ఎఫ్3 ప్లస్‌ను ఏక కాలంలో ఐదు దేశాల్లో లాంచ్ చేశారు. సెల్ఫీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ఈ ఫోన్‌లో 16ఎంపి ప్రధాన కెమెరా, 8ఎంపి సబ్-కెమెరాతో హైక్వాలిటీ చిత్రాలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఫీచర్లు ఇలా ఉన్నాయి..

  • ఫ్లాష్‌తో డ్యూయల్ ఫ్రంట్ కెమెరా(16ఎంపి+8ఎంపి)
  • ఫ్లాష్‌తో 16ఎంపి రేర్ సెన్సార్
  • 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 652
  • 1.96 గిగాహెడ్జ్ ప్రాసెసర్
  • 4జిబి రామ్
  • 64జిబి ఇంటర్నల్ స్టోరేజీ, ఎక్స్‌పాండబుల్ 256జిబి వరకు(మైక్రో ఎస్‌డి కార్డ్‌తో)
  • బ్యాటలీ సామర్థం 4000 ఎంఎహెచ్
  • ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మాల్లో

Comments

comments