Home టెక్ ట్రెండ్స్ ఒప్పో నుంచి రెనో జ‌డ్ స్మార్ట్‌ఫోన్…

ఒప్పో నుంచి రెనో జ‌డ్ స్మార్ట్‌ఫోన్…

OPPO-Reno-Zముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ రెనో జ‌డ్‌ను గురువారం చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లో 6.4 ఇంచుల డిస్‌ప్లేతో పాటు… వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను, ముందు భాగంలోనూ 32 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఇందులో అమర్చారు. 8 జిబి ర్యామ్‌ను ఏర్పాటు చేయండంతో ఫోన్ వేగవంతంగా పని చేస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ ఫోన్ లో 4035 ఎంఎహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఒప్పో అందిస్తోంది. ఒప్పో రెనో జ‌డ్ ఫోన్ ప‌ర్పుల్‌, జెట్ బ్లాక్‌, వైట్‌, కోర‌ల్ ఆరెంజ్ క‌ల‌ర్స్ లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను రూ.25,270 ప్రారంభ ధ‌ర‌కు కస్టమర్లకు విక్ర‌యిస్తున్నారు.

ఒప్పో రెనో జ‌డ్ అద్భుత ఫీచ‌ర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే

2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి90 ప్రాసెస‌ర్‌

6/8 జిబి ర్యామ్‌, 128/256 జిబి స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48

5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వివొఎల్‌టిఇ, డాల్బీ అట్మోస్‌, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్ సి, 4035 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Oppo Reno Z Smartphone Launched in China