Home జోగులాంబ గద్వాల్ ప్రైవేటు యునివర్సిటీలను వ్యతిరేకిద్దాం

ప్రైవేటు యునివర్సిటీలను వ్యతిరేకిద్దాం

తెలంగాణ విద్యార్థి వేదిక నేతలు

TVV

గద్వాలటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రైవేటు, విదేశి యునివర్సిటీలను ప్రోత్స హించే విధంగా వ్యవహిరిస్తుండడం దళిత, పేద, మధ్య తరగతి విద్యార్థులకు శాపంగా మారుతుం దని ఈచర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ విద్యార్థి వేదిక నేతలు మద్దిలేటి, బాల రాం, నాగరాజులు అన్నారు. ఆదివారం వారు స్థానిక రాంరెడ్డి లైబ్రరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ కంపెనీ వారికి వెయ్యి ఎకరాలను కెటా యించిందని, ఇక్కడ ప్రైవేటు యున్సివర్సిటీలు ఏర్పాటు చేస్తారని పేర్కోన్నారు.

దీని వల్ల ఇప్పుడి ప్పుడే ఉన్నత విద్యాను అందుకుంటున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతారని ఆందో ళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేసి ప్రభుత్వమే ప్రతి జిల్లాకో యునివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండువ చేశారు. అధేవిధంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన యునివర్సిటీల్లో పలు సమస్యలు రాజ్యమేలు తున్నాయని వాటిని తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అనిల్, స్వామి, రాజు, వీరేష్, యువరాజు, సందీప్, రాజు, జాన్, శశి తదితరులు పాల్గొన్నారు.