Home తాజా వార్తలు ఎన్నికలకు భయపడుతున్న ప్రతిపక్షాలు : కెటిఆర్

ఎన్నికలకు భయపడుతున్న ప్రతిపక్షాలు : కెటిఆర్

Opposition Parties fears to Elections: KTR

హైదరాబాద్ : ఎన్నికలు అంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలంగాణ మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా , అందుకు టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. జలవిహార్‌లో ఆదివారం జరిగిన సనత్‌నగర్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజకీయాలతీతంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన చెప్పారు. విపక్షాల కూటమికి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ సిఎంగా ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలకు పోలేదా అని ఆయన ప్రశ్నించారు. బిజెపి చేస్తే ఒప్పు, తాము చేస్తే తప్పా అని ఆయన నిలదీశారు. రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడడం లేదని, కేంద్రమే రాష్ట్రాలపై ఆధారపడుతోందని పేర్కొన్నారు. టిడిపి, ఇత పార్టీలతో కాంగ్రెస్ కూటమి కట్టినా, టిఆర్‌ఎస్‌ను ఓడించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. భారీ మెజార్టీతో సనత్‌నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌ను గెలిపించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Opposition Parties fears to Elections: KTR