Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రతిపక్షాల నోరు బంద్

Opposition  with mouth  bandh Telangana Development

తెలంగాణ అభివృద్ధితో  ప్రతిపక్షాల నోరు బంద్

రైతుబీమా, రైతుబంధుతో సంక్షేమ పథకాల ఆకర్షణతో 250 మంది టిఆర్‌ఎస్‌లో చేరిక
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/పెబ్బేరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాల నోరు బందైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్ధేవా చేశారు. మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్‌హాల్‌లో టిఆర్ ఎస్ మండలాధ్యక్షులు శంకర్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్ర మానికి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెబ్బేరులో టిడిపి, బిజెపి పార్టీల నుండి దాదాపు 250 మంది నాయకులు, కార్యకర్తలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి కార్యక ర్తలను పార్టీ కండువాలతో వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథంలో దేశంలోనే తెలంగాణ నేడు  మొట్ట మొదటి స్థానం చేరుకుందన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణం కోసం గత పాల కులు 35 సంవత్సరాల సమయం తీసుకున్నారన్నారు. ఏదుల రిజర్వాయ ర్ పనులను రెండున్నర సంవత్సరాల కాలంలోనే పూర్తి చేయడం జరిగిందన్నారు. జూరాల ప్రాజెక్టులో 9 టిఎంసిలకు గాను 6.5 టిఎం సిల నీరు నిల్వ ఉంటుందన్నారు. ఏదుల రిజర్వాయర్‌లో 7 టిఎంసిల నీరు నిల్వ ఉంచేందుకు ప్రాజెక్టును డిజైన్ చేయడం జరిగిందన్నారు. గతంలో మంత్రిగా పని చేసిన నాయకులు, ఎంపిగా పని చేసినఇద్దరు నాయకులు వనపర్తికి ఒరగబెట్టిందేమిలేదన్నారు .రైతులను ఒప్పించి బతిమాలి భూసేకరణనుఏదుల రిజర్వాయర్‌కు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రాజెక్టులోని నీళ్లు రైతుల ప్రతిబింబాలన్నారు. ఖిల్లా ఘణపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌ల్లో సాగునీరు పారడంతో నీళ్ల నిరంజన్‌రెడ్డిగా రైతులు నేడు సాగునీటితో హర్షం వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. చెరువుల్లో నీళ్లు సమృద్దిగా ఉన్నాయన్నారు.వృద్దులకు ,కులవృత్తులకు ప్రాధాన్యత పెరిగిందన్నారు .సిఎం కెసిఆర్ రైతుబంధు,రైతుభీమాతో రైతులపాలిట రైతుఆత్మీయుడయ్యారన్నారు. సిఎం కెసిఆర్ రైతులకు ఆపద్భాంధవుడయ్యారన్నారు. రూ. 5 లక్షల భీమాతో రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు. నిరంజన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లోకి చేరారు.చేరిన నాయకులను పార్టీకండువాలతో నిరంజన్‌రెడ్డి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, ఎంపిపి పద్మావతి రమణ, జడ్పిటిసి ప్రకాష్, వైస్‌చైర్మన్ విశ్వరూపం, టిఆర్‌ఎస్ పార్టీ లో చేరిన నాయకులు రాంచంద్రారెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, ఐజాక్, పాల్గొన్నారు.

Comments

comments