Search
Monday 24 September 2018
  • :
  • :

నోటి కేన్సర్ గాయాలకు తేనెతో చికిత్స

Honey use for Oral Cancer Woundsసహజసిద్ధంగా లభించే తేనెలో నోటి కేన్సర్ గాయాలను వేగంగా నయం చేసే గుణం ఉందని  భారతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది.  కేన్సర్ గాయాలను నయం చేయడంతోపాటు వ్యాధి తిరగబెట్టే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఈ బృందం తెలిపింది.

ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన కెమికల్ ఇంజనీర్లు బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలు  ఓ బృందంగా ఏర్పడి ఏళ్ల తరబడి పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు.  తేనెలో గాయలను మాన్పే గుణంతోపాటు  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్త మోనికా రాజ్‌పుత్ పేర్కొన్నారు.

భారత దేశంలో నోటి కేన్సర్ మరణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యలో కేన్సర్ గాయలను మాన్పేందుకు తేనె, సిల్క్ పొరలతో ఓ పట్టీని తయారుచేశామని మోనిక తెలిపారు.

శస్త్ర చికిత్స ద్వారా  కేన్సర్ కణితిని తీసివేసినా, ఆ గాయలలో కేన్సర్ అవశేషాలు మిగిలిపోవడం వల్ల వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో తాము రూపొందించిన పట్టీ గాయాన్ని మాన్పడంతోపాటు కేన్సర్ కణాలను అణచివేసి ఆరోగ్యకరమైన కణాలను అభివృద్ధి చేస్తుందన్నారు.

Comments

comments