Home సినిమా వీడియోలు మనసును పిండేసే రంగస్థలం ‘ఓరయ్యో.. నా అయ్యా’…

మనసును పిండేసే రంగస్థలం ‘ఓరయ్యో.. నా అయ్యా’…

Orayyo Lyrical Video Song Out Now

హైదరాబాద్: లెక్కల మాస్టారు సుకుమార్, మెగా వారసుడు రాంచరణ్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిందే. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి విశేష ఆదరణ లభిస్తోంది. సినిమాలో ఉన్న ప్రతి పాత్ర.. ప్రేక్షకులని కట్టిపడేస్తుండటంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా చిట్టిబాబుకి అందరూ ఫిదా అవుతున్నారు. సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓ మెట్టు పైకి ఎక్కించిదనేది కాదనలేని నిజం. ఆల్బమ్ లోని ప్రతి సాంగ్ శ్రోతులను రంజింప చేస్తుంది. ఇప్పటి వరకు రంగస్థలం ఆడియో ఆల్బమ్ లో చిత్ర యూనిట్ కేవలం ఐదు పాటలను మాత్రమే విడుదల చేసింది. చిత్రం భారీ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్ చిత్రానికి సంబంధించిన మరో పాటను తాజాగా విడుదల చేసింది. ఆడియో ఆల్బమ్‌లో లేని ఈ సాంగ్‌ని ప్రత్యేకంగా విడుదల చేశారు. ‘ఓరయ్యో.. నా అయ్యా’ అంటూ సాగే ఈ పాట మూవీలో చూస్తుంటేనే కాదు.. వింటున్నా కూడా హృదయాలను కదిలించేస్తుంది. చంద్రబోస్ స్వయంగా రాసి, పాడిన ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.