Home తాజా వార్తలు అందరూ అవయవ దానం చేయాలి: కవిత

అందరూ అవయవ దానం చేయాలి: కవిత

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌కు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా అవయవదానం సంకల్ప కార్యక్రమం చేపట్టారు. తొలుత పుల్వామా అమరవీరులకు ఎంపి కవిత, సంతోష్ కుమార్ నివాళులర్పించిన అనంతరం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కవిత  మాట్లాడారు. కోట్లాది మంది ప్రజలను పరాయి పాలన నుంచి విముక్తి చేసిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని పొగిడారు. పేద ప్రజల కష్టాలు తీర్చే గొప్ప మనసున్న వ్యక్తి కెసిఆర్ అని ప్రశంసించారు. వచ్చే ఏడాది సిఎం కెసిఆర్ పుట్టిన రోజు వరకు అంటే సంవత్సర కాలం పాటు అవయవదాన కార్యక్రమం సాగుతుందన్నారు. అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అందరూ అవయవదానం చేయాలని కవిత సూచించారు. ఆరోగ్య శ్రీలో కూడా అవయవదాన మార్పిడిని కూడా చేర్చామని, నిమ్స్‌లో చేసిన అవయవ మార్పిడి ఆపరేషన్లన్నీ విజయవంతమయ్యాయని, వైద్యుల కమిట్‌మెట్‌తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయని మెచ్చుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరుపున వైద్యులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. అవయవదానం, శరీరదానంపై అపోహలు వద్దన్నారు. అవయవ మార్పిడి ఆపరేషన్లు ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తుందని స్పష్టం చేశారు. అవయవదాన పత్రంపై ఎంపి కవిత సంతకం చేశారు. ఎంపిలు కల్వకుంట్ల కవిత, సంతోష్ కుమార్, ఎంపి బిబి పాటిల్, ఎంఎల్‌ఎ ముఠాగోపాల్, మాజీ ఎంఎల్‌ఎ ఓదెలు, దేవీ ప్రసాద్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరలు పాల్గొన్నారు.

Telangana news

 

 

Organ Donation is Important: Kavitha