Search
Wednesday 17 October 2018
  • :
  • :

మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించండి

Organize Panchayat Elections within 3 Months

హైదరాబాద్ : తెలంగాణలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు ముగిసిన పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఓటర్ల జాబితాను తక్షణమే తయారు చేయాలని ఆదేశించింది. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. వివిధ కారణాలు చూపిస్తూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని కోర్టు తేల్చి చెప్పింది.

Organize Panchayat Elections within 3 Months

Comments

comments