Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గిన్నిస్‌బుక్‌కు ఒఆర్‌ఆర్

ORR

మన తెలంగాణ / సిటీబ్యూరో : నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్ త్వరలోనే గిన్నిస్‌బుక్ రికార్డుల్లోకి ఎక్కనున్నది. అందుకు హెచ్‌ఎండిఎ అధికారులకు గిన్నిస్ బుక్ రికార్డుల ప్రతి నిధుల నుండి సమాచారం వచ్చినట్టు తెలిసింది. ప్రపంచంలో ఏ మహానగరం చుట్టూర కూడా పూర్తిగా రింగ్ ఆకారంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ వే లేదని, ఓఆర్‌ఆర్ పొడవు 158 కి.మీ.లుగా లేదని హెచ్‌ఎండిఎ కార్యాలయంలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై గిన్నిస్ రికార్డులకు సంబంధించిన ప్రతినిధులు అథారిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. 8 లేన్‌లుగా, గంటకు 120 కి.మీ.ల వేగంతో డిజైన్ చేసిన ఎక్స్‌ప్రెస్‌వే మరి ఏ దేశంలోనూ లేదనే అభిప్రాయాన్ని గిన్నిస్ బుక్ రికార్డుల వారు ప్రస్తావించినట్టు తెలిసింది. ఔటర్ ఎక్స్‌ప్రెస్‌వేకున్నట్టుగా ఇరువైపుల రెండు సర్వీసు రోడ్లు, కేవలం కూడళ్ళలోనే ప్రవేశించడంగానీ, దిగిపోవడం గానీ ప్రపంచంలోని ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలకు లేదని ఉన్నతస్థాయి అధికారులు కూడా వెల్లడి స్తున్నారు. బీజింగ్ నగరానికి ఉన్న రింగ్ రోడ్లలో 3వది 48 కి.మీ.లు, 4వ ది 65 కి.మీ.లుగా ఉన్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రష్యాలోని పీటర్స్ బర్గ్‌లోని రింగ్‌రోడ్ 147 కి.మీ.లుగానూ, దక్షిణాఫ్రికాలోని జోహన్నె స్‌బర్గ్‌లో రింగ్ రోడ్ పొడవు 80 కి.మీ.లుగా ఉన్నదని, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం రింగ్ రోడ్ 70 కి.మీ.లు, ఇటలీ రాజధాని రోమ్ రింగ్ రోడ్ 68 కి.మీ.లుగా ఉన్నట్టు హెచ్‌ఎండిఎ అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 158 కి.మీ.లు పొడవు, నగరం చుట్టూర ఓ రింగ్ వలె ఉండటం కూడా విశిష్టతగానే ఉన్నందను గిన్నిష్‌బుక్‌లో రికార్డు చోటు సంపాదించడం ఖాయంగా ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

Comments

comments