Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రైతు సంక్షేమమే మా ధ్యేయం

Harish-Raoబడ్జెట్‌లో 35శాతం నిధులు కేటాయించిన ఘనత టిఆర్‌ఎస్‌దే
మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ: మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మనతెలంగాణ/పరకాల: గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు జరుపుతున్నారని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమా ణ స్వీకారానికి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధ్ది కోసం బడ్జెట్‌లో 35శాతం ని ధులను కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని మార్కెట్‌లు కొ త్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. గత ప్రభుత్వాలు మా ర్కెట్‌లో రైతుకు మద్దతుగా నిలబడిన సందర్భాలు లేవని వి మర్శించారు. తెలంగాణలో నకిలీ విత్తనాలు, పురుగు మం దులు, ఎరువులు లేకుండా చూసిన ఘనత ప్రభుత్వందే నన్నారు. రైతుల కోసం తెలంగాణలో ఇప్పటి వరకు 1024 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. వీటి వలన 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే వీలు కలుగుతుందన్నారు.పరకాలలో కొద్ది రోజుల్లోనే డ్రైయర్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ను మూడేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందిస్తామ న్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్, టి డిపిలకు పుట్టగతులు ఉండవన్నారు. 2017 నాటికి గోదా వరి జలాలను పరకాల ప్రాంతానికి అందిస్తామని పేర్కొ న్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా వరంగల్ జిల్లా లోని 5,500 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి వాటిని అభివృద్ధ్ది చేయడం జరిగిందన్నారు. పరకాల పట్టణానికి, మండలానికి పోరాట చరిత్ర ఉందని పరకాల మండలాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్ర యత్నిస్తానని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నా రు. పరకాల పట్టణ ప్రజల చిరకాల వాంచగా మిగిలిన డి విజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా స్పీకర్, మంత్రి హ రీశ్‌రావు ప్రయత్నించాలని స్థానిక శాసనభ్యుడు చల్ల ధ ర్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి పసునూరి ద యాకర్, శాసనసభ్యులు ఆరూరి రమేష్, శంకర్‌నాయక్, సివిల్ సప్లైయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, క న్నెబోయిన రాజయ్యయాదవ్, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, టిఆర్‌ఎస్ పార్టి జిల్లా అధ్యక్షుడు ర వీందర్‌రావుపాల్గొన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకన్న ప్రమాణ స్వీకారం చేశారు

Comments

comments