Home స్పెషల్ ఆర్టికల్స్ మా నాయకుడు బాహుబలి… లోకేశ్ బ్రహ్మానందం..!

మా నాయకుడు బాహుబలి… లోకేశ్ బ్రహ్మానందం..!

YCP-MLA-Anil-yadav

అమరావతి: సరిగ్గా పేపర్ కూడా చదవడం రాని నారా లోకేష్ ను మంత్రిని చేసి అతనే కాబోయే ముఖ్యమంత్రి అనటం హాస్యాస్పదంగా ఉందని వైసిపి యువనేత, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా విమర్శించారు. సోమవారం రైతులకు మద్దతిస్తూ వైసిపి అగ్రనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షలో ఆయర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందన్నారు. గతంలో చేసిన పాదయాత్రలను చంద్రబాబు ఇప్పుడు చేస్తే ప్రజలు ఆయనను చీపుర్లు, కర్రలతో తరిమి కొడతారని ఆయన అన్నారు. అబద్ధాల హామీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. అబద్దాలు నేర్చుకోవాలంటే ఎవరైనా పుస్తకాలు చదవదలిస్తే టిడిపి మేనిఫెస్టో చదివి నేర్చుకోవచ్చన్నారు.
జగన్ కు లోకేశ్ కు పోలికేంటని అన్నారు. జగన్మోహన్ రెడ్డి బాహుబలి అయితే లోకేశ్ హాస్య నటుడు బ్రహ్మానందం అని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీ, ధర్మం వైపు నిలబడి పోరాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనిల్ యాదవ్ అన్నారు.