Home జనగామ కెసిఆర్‌కు మా శక్తి చూపిస్తాం

కెసిఆర్‌కు మా శక్తి చూపిస్తాం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం

CPI

స్టేషన్ ఘన్‌పూర్ : రాష్ట్రంలో 93 శాతం ఉన్న సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరించి పనిచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తమ శక్తి ఎంటో చూపిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం గత సంవత్సరం అక్టోబర్ 17 చేపట్టిన మహాజన పాదయాత్ర జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రానికి తొమ్మిది మంది బృందంతో  బుధవారం చేరుకుంది.

ఈ సందర్భంగా బస్ స్టాండ్ వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బిసి, ఎస్‌సి, ఎస్‌టి,  మైనారిటీ, ఎంబిసిల బతుకులు బాగుపడినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి సార్ధకత ఉంటుంద న్నారు. కెసిఆర్ రెండున్నర సంవత్సర పాలనలో ఎర్రవెల్లి, నర్సన్నపేటలో రెండు పడకల ఇళ్లు 500 కట్టించి వాటిని రాష్ట్ర మంతా చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నా రన్నారు. తాను చేస్తున్న పాదయాత్రలో ఎక్కడ కూడ రెండు పడకల ఇళ్లు నిర్మించ లేదని ఆయన ఆరోపించారు. ఎస్‌సి, ఎస్‌టిల కు మూడు ఎకరాల వ్యవసాయ భూమి, రిజర్వేషన్లు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీక రణ లేకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీని అమలు చేయకుండా ప్రజలను మాటలతో మభ్యపెడుతూ మోసం చేస్తున్నార ని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుంచి బలవంతంగా భూములను గుంజుకుం టూ వారికి తగిన నష్టపరిహారం కూడా ఇవ్వడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకట్రాజం, రాపర్తి రాజు, తోట రమేశ్, ఉడుత రవి, బొట్ల శ్రీనివాస్, కోండల్ రెడ్డి, కమాలకర్ రెడ్డి, వెన్నకూస కుమార్, రాపర్తి సోమయ్య ఉన్నారు. అనంతర పాదయాత్ర మండలంలోని  విశ్వనాధపురం , ఇప్పగూడెంకు చెరుకుంది.