Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఔట్‌సోర్సింగ్!

Outsourcing-!గృహనిర్మాణ సంస్థ ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు
హౌసింగ్‌లో పనిలేదనే కారణాలతో ఇతర శాఖల్లోకి సర్దుబాటు యత్నాలు
మార్చి నెలతో ముగిసిన గడువు – ఊగిసలాడుతున్న హౌసింగ్ ఉద్యోగాలు
తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, సర్ధుబాటు చేయాలి : ఉద్యోగులు
జిల్లాలో 144 మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం
ఏప్రిల్ నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు..
నల్లగొండ : రాష్ట్ర హౌజింగ్ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర శాఖలలోకి సర్ధుబాటు చేయాలని వారి నుంచి సంబంధిత రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న 1,179 మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గృహ నిర్మాణ సంస్ధ అవుట్‌సోర్సింగ్‌లో 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఐటి మేనేజర్, సహాయక ఇంజనీర్లు, వర్క్ ఇన్స్‌పెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లను తొలగించేందుకు ఈనెల 23నాడు పథకసంచాలకులు మార్చి 31వ తేదీలోపు సంబంధిత రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఏప్రిల్ మాసం నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఒక వేళ ఇతర శాఖలలోకి సర్ధుబాటు చేస్తే చేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ మౌలిక ఆదేశాలు జారీ చేయడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే నల్లగొండ జిల్లాలో గృహ నిర్మాణ శాఖలో ఐటి మేనేజర్ ఒకరు, సహాయక ఇంజనీర్లు 20 మంది, వర్క్ ఇన్స్‌పెక్టర్లు 89, కంప్యూటర్ ఆపరేటర్లు 19, అటెండర్లు 10, ఇతర ముగ్గురు మొత్తం 144 మంది ఔట్‌సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,179 మంది గృహ నిర్మాణ శాఖలో ఔట్‌సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న తమను తొలగిస్తే పరిస్థితి ఏమిటని ఆయెమయంలో కొట్టుమిట్టాడు తున్నారు. 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నా మని వయో పరిమితి కూడా మారిపో యిందని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతా యని అనుకుంటే ఉన్న ఉద్యోగాలను తొలగించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సొంత శాఖ అయిన గృహ నిర్మాణంలో పనిలేకపోవడం ఇతర శాఖల్లో సర్ధుబాటు చేసే ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఏకంగా వీరిని ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 24వ తేదీన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమాఆర్, చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య సమక్షంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ మౌళిక ఆదేశాల ప్రకారం (గృహ) నల్లగొడ లేఖ నెంబర్ బి1/ఏఎంఏ/ హౌసింగ్/2016 జీఓ ప్రకారం మార్చి 23 నుంచి సంబంధిత అధికారులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తమ జీవితాలు బాగు పడుతాయనుకుంటే ఒక్కసారి పిడుగులాంటి వార్త విన్న హౌజింగ్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని పేదలకు సొంత ఇళ్ళు నిర్మించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మార్పు చేసుకొని డబుల్ బెడ్‌రూం ఇళ్లనిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో ఆ పనులను ఇతర శాఖలకు అప్పగించడంతో హౌసింగ్‌కార్పొరేషన్‌లో పనిచేస్తున్న వీరికి పని లేకుండా పోయింది. వాస్తవానికి 1,536 మంది ఔట్‌సోర్సింగ్ ప్రతిపాదనలో పనిచేస్తున్నారు. ఇందులో పనిలేకపోవడంతో ఇప్పటికే 379 మంది ఔట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లను మిషన్ కాకతీయలో సర్ధుబాటు చేశారు. మిగిలిన 1,179 మందిని కూడా వారి విద్యార్హతల ఆధారంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖల్లో సర్ధుబాటు చేయాలని ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి వేతనాలు పెంచుతూ ఫిబ్రవరి ఒకటిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారంగా ఐటి మేనేజర్లకు 24వేలు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ. 18,900, వర్క్ ఇన్‌స్పె క్టర్లకు రూ. 15వేలు, అటెండర్లకు రూ. 12వేల చొప్పున వేతనాలను పెంచి ఈ ఏడాది జనవరి నుంచే అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం జిఓ 14 అమలు చేయలేదని అందుకే హౌజింగ్‌లో పనిచే స్తున్న ఉద్యోగులకు అమలు చేయలేదని దీంతో ఈ ఉద్యోగులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సర్ధుబాటు చేయాలనుకుంటే మిషన్ భగీరథలో 79 వర్క్‌ఇన్‌స్పెక్టర్లు, మిషన్ కాకతీయలో 30వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 20 కంప్యూటర్ ఆపరేటర్లు, మున్సిపల్ శాఖలో 40 బిల్లుకలెక్టర్లు, డ్వామాలో 30 టెక్నికల్ అసిస్టెంట్లు, 15 కంప్యూటర్ ఆపరేటర్స్, పంచాయితీరాజ్లో 50 పంచాయితీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. తమకు న్యాయం జరుగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని గృహ నిర్మాణ శాఖ ఔట్‌సోర్సింగ్ సంఘాల నాయకులు శేఖర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డిలు పేర్కొన్నారు.

Comments

comments