Home మహబూబ్‌నగర్ పంపకాల పందేరం… పట్టించుకోని అధికార గణం…

పంపకాల పందేరం… పట్టించుకోని అధికార గణం…

Outside the open ground without resolutions

తీర్మానాలు లేకుండా బహిరంగ భూమి పంపకం
అక్రమ నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోని పంచాయతీరాజ్ శాఖ అధికారులు
ఓటు బ్యాంకు కోసమే పంపకాల పందేరం
కాంగ్రెస్ పార్టీ నాయకుని భూమి పంపకాలను అడ్డుకునే వారేలేరా.!

మన తెలంగాణ/మిడ్జిల్ : వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి లేఔట్‌లు చేసి నివాసయోగ్యమైన కనీస సౌకర్యాలను కల్పించకుండా 10 శాతం భూమిని ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ముడుపులు ఇచ్చి వారిని తమ కనుసన్నలలోకి తెచ్చుకుని మిడ్జిల్ మండలంలో రియల్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని యథేచ్చ గా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ భర్త తన రాజకీయ భవిషత్తును కాపాడుకోవడానికి ప్రభుత్వానికి చెందాల్సిన 10 శాతం బహిరంగ భూమిని ఇష్టారీతిన పంపకాల పందేరానికి పూనుకున్న వైనం ‘మన తెలంగాణ’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.

తీర్మానాలు లేకుండానే పంపకాలు.. అక్రమ నిర్మాణాలు..
మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, మిడ్జిల్ మండల పరిధిలోని మిడ్జిల్ గ్రామ పంచాయతీ పరిధిలో వెలసిన వెంచర్‌లలో ప్రభుత్వానికి సమర్పించిన బహిరంగ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేట్టినా ప్రభుత్వ అధికారులు చోధ్యం చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తంగెల్ల అల్వాల్‌రెడ్డి తనకు అనుకూల ంగా వున్న కుల మత యువజన సంఘాలకు గ్రామ పంచాయతీ తీర్మాణాలు లేకుండానే ధారా దత్తం చేస్తు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన ఓటు బ్యాంకుకు పునాదులు వేస్తున్నాడనే విమర్శలు వెల్లువేత్తుతున్నా మండ ల పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుడంటం పట్ల పలు అనుమానాలు రేకేత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని బహిరంగ భూమి పంపకాల పందేరం పట్ల ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాధులు అందినా జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ప్రభుత్వ అధికారుల వైఖరిని సామాజిక కార్యకర్తలు తప్పుపడుతున్నారు.

బహిరంగ భూమిని ప్రజల ఉపయోగార్ధమే వినియోగించాలి..
వేంచర్‌ల యజమానులు గ్రామ పంచాయతీకి సమర్పించిన 10 శాతం బహిరంగ భూమిని ఎక పక్షంగా వ్యవహరించి తన స్వంత ఆస్థిలా దారదత్తం చేస్తున్న భూములను ప్రభుత్వం కైవసం చేసుకుని ప్రజల అవసరాల కోసమే వినియోగించాలని మండల ప్రజలు కోరుతున్నారు. తీర్మాణాలు లేకుండా నిర్మాణాలు కోనసాగుతున్నా మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేనందున జిల్లా స్థాయి ఉన్నత అధికారులైనా తక్షణమే జోక్యం చేసుకుని భహిరంగ భూమి పంపకాల పందేరానికి కళ్లేం వేసి భహిరంగ భూమిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.