Home నవ విజ్ఞానం భారతీయ సంస్కృతిలో నెమలికి విశిష్ట స్థానం

భారతీయ సంస్కృతిలో నెమలికి విశిష్ట స్థానం

Outstanding Position To Peacock In Indian Culture

 

మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ పక్షి నెమలికి భారతీయ సంస్కృతిలో విశిష్టమైన స్థానముందని ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రభాత్ అన్నారు. భారతీయ సంస్కృతిలో నెమలి సాధించుకున్న స్థానాన్ని ఈ సందర్భంగా వివరించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కాసు బ్రహ్మనందపార్కులో ‘మయూరి’ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాలల నుంచి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణపై చిత్ర లేఖనం, వక్తృత్వం, ఫ్యాన్సీ డ్రెస్ తదిరత పోటీలను అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు బారతీయ సంస్కృతిలో జాతీయ పక్షి నెమలికున్న ప్రాముఖ్యత, దాన్ని ఔనత్యాన్ని వివరించారు.

వివిధ రకాల కళారూపాలతో సైతం చిన్నారులు ప్రదర్శించారు. దీంతో పాటు వన్యప్రాణులు, అడవుల ప్రాధాన్యత, ఆవశ్యకతను వివరిస్తూ చిన్నారులు పలు రకాల ప్రదర్శలను కూడా నిర్వహించారు. చిన్నారుల కళా ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో పాటు చిన్నారులు మయూరి నాట్యం, శివ తాండవం, హరితహారం నృత్య రూపంతో పాటు సర్ప దర్శనం సైతం అహుతులను అలరించాయి. ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన వారితో పాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అధికారులు బహుమతులను కూడా ప్రధానం చేశారు. జాతీయ పక్షి నెమలిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

పర్యావరణలో నెమలికున్న అత్యధిక ప్రాధాన్యత ఉందని కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన డాక్టర్ ప్రభాత్ వివరించారు. ఈ సందర్భంగా అదనపు అటవీ ముఖ్య సంరక్షణాధికారి మునీంద్ర మాట్లాడుతూ జాతీయ చిన్నారుల అవసరం చాలా ఆవశ్యకమన్నారు. నేటి బాలలే రేపటి భావి పౌరులనే అంశాన్ని ఈ చిన్నారులు తమ ప్రదర్శనలు, కళారూపాల ద్వారా వివరించారని అభినందించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రశ్నల ద్వారా చిన్నారులు తమ ప్రజ్ఞను ప్రదర్శించారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ తిరుపతయ్య, శంకరన్‌తో పాటు పలువురు అటవీ అధికారులు పాల్గొన్నారు.

Outstanding Position To Peacock In Indian Culture

Telangana Latest News