Home లైఫ్ స్టైల్ సర్వరోగ నివారిణి

సర్వరోగ నివారిణి

body

ఓంకారాన్ని సుస్వరంగా సాధనచేస్తే ఆరోగ్యపరంగా గొప్ప ఫలితాన్నిస్తుందని తాజా పరిశోధనలలో వెల్లడైంది.
మన శరీరంలో మెదడు నుంచి పొత్తికడుపు వరకు సాగే అతిపెద్ద నరాలు 12 ఉంటాయి. ఓంకారాన్ని మంద్రస్థాయిలో
జపించడం ద్వారా పుట్టే నాద ప్రకంపనలు 10వ ప్రధాన నరమైన వాగస్ నెర్వ్‌ను ప్రభావితం చేసి
కంపింపచేస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. ఓంకార శక్తిని గమనించేందుకు
శాస్త్రవేత్తలు ఫంక్షనల్ మాగ్నెటిక్ రిజొనాన్స్ ఇమేజింగ్ (ఎఫ్‌ఎంఆర్‌ఐ) యంత్రాన్ని స్టాస్టికల్
పారామెట్రిక్ మాపింగ్ 5 (ఎస్‌పిఎం5)ను వినియోగించి న్యూరోడైనమిక్ కోరిలేషన్‌ను గమనించారు.

మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఓంకారం జపించినప్పుడు కలిగే స్పందనలను విడివిడిగా గమనించారు. ఓంకారాన్ని జపించడానికి ముందు ఉండే శూన్యస్థితిలో వినిపించే ‘స్స్‌స్స్‌స్స్‌స్స్…’ అనే గాలిచప్పుడుని కూడా శాస్త్రవేత్తలు లెక్కించారు. ఓంకారం జపించేటప్పుడు మెదడు ఎలాంటి చలనం లేక పరమ ప్రశాంత స్థితిలో ఉండడాన్ని సైంటిస్టులు గమనించారు. డిప్రెషన్, ఎపిలెప్సీ రోగులకు చికిత్సల సమయంలో కలిగించే లింబిక్ డియాక్టివేషన్ లాంటిదే ఓంకారాన్ని జపించేటప్పుడు మెదడులో కనిపించిందని చెప్పారు. డిప్రెషన్, ఎపిలెప్సి రోగులకు చికిత్స చేసేందుకు వాగల్ నెర్వ్ స్టిమ్యులేషన్ (విఎన్‌ఎస్) సిస్టమ్‌లో ఈ పెద్దనరంలో స్పందనలు కలిగించి మెదడు స్థితిని గమనిస్తారు. విఎన్‌ఎస్ చికిత్సలో విద్యుత్ తరంగాల ద్వారా ఈ పెద్ద నరానికి స్పందన కలిగిస్తారు. సరిగా ఇలాంటి స్పందననే ఓంకారం కలిగిస్తోంది. ఓంకారాన్ని సుసరంగా జపించినపుడు చెవుల వద్ద ప్రకంపనలు కలిగినట్టు అనిపిస్తుంది. సరిగా అలాంటి ప్రకంపననే డాక్టర్లు డిప్రెషన్‌లో ఉన్న రోగికి కృత్రిమ విధానాల ద్వారా అందిస్తారు. ఈ ప్రకంపనలవల్ల మెదడు ప్రశాంత స్థితికి చేరుతుంది. ఈ పరీక్షలు నిర్వహించడానికి సైంటిస్టులు పూర్తి ఆరోగ్యంతో ఉన్న 9 మంది మగవాళ్ళను ఎంచుకున్నారు. వీరంతా 2239 సంవత్సరాల లోపు వారే! అంతా కుడిచేతి వాటం ఉన్నవాళ్ళే! అంతా చదువుకున్నవారే! వీరిలో నలుగురికి యోగా లో అంతో ఇంతో ప్రవేశం ఉంది. మిగిలిన వారికి యోగా, ధ్యానాల వంటివేవీ తెలియవు. వీరికి ఓంకారం గురించి దాన్ని ఎందుకు జపిస్తారు? ఏమి ఆశించి జపిస్తారు? వంటి ప్రాథమిక సమాచారాన్ని ఇచ్చి వారి సహకారం తీసుకున్నారు. ఓంకారాన్ని కరెక్ట్ పిచ్‌లో ఎలా జపించాలో నేర్పించారు. యోగ విద్యలో అనుభవం ఉన్న టీచర్‌ను ఎంచుకుని వీరికి శిక్షణ ఇప్పించారు. ఓ అనే ధ్వనికి 5 సెకన్ల సమయాన్ని, మ్ అన్న ధ్వనిని 10 సెకన్ల సమయాన్ని కేటాయించుకుని జపించాలని చెప్పి వారికి అందుకు తగ్గట్టుగా శిక్షణ ఇచ్చారు. ఓంకారాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తున్నప్పుడు మెదడులో కలిగే స్పందనలను గుర్తించడానికి ఎలక్ట్రో ఫిజియొలాజికల్ స్టడీ చేశారు. ఓంకారం జపించేటప్పుడు డిప్రెషన్ లేకుండా, ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ఉండేలా జాగ్రత్తలు పడ్డారు. స్వరపేటిక నుంచి మొదలయ్యే ధ్వని ప్రకంపనలు ఈ వాగస్ నరాన్ని ఎలా కంపింపజేస్తోందో గమనించారు. ఓంకార జపం చేసే వారిని మటంవేసుకుని కూచోమని సూచించారు. ముందుగా ఎంఆర్‌ఐ పరీక్షలు జరిపేవారు. ఇందుకోసం టెస్లా ఎంఆర్‌ఐ హైరిజొల్యూషన్ స్కానర్లను ఉపయోగించారు. వారంతా ఈ పరీక్షకు అలవాటుపడ్డాక ఎఫ్‌ఎంఆర్‌ఐ మొదలుపెట్టారు. ఓంకారాన్ని జపించేటప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందని అడిగి తెలుసుకున్నారు. ఓంకారనాదం చేయడానికి ముందుండే శాంతస్థితిని వదిలిపెట్టి సరిగా ఉచ్చరిస్తున్న సమయంలో శరీరంలో ఎలాంటి స్పందనలు కలిగాయో అడిగి తెలుసుకున్నారు.

* జపం మొదలుపెట్టకముందు బ్రైన్‌స్కాన్ చేసి వాస్తవ పరిస్థితిని గుర్తించారు
* ఇకోప్లానర్ ఇమేజింగ్ (ఇపిఐ) ద్వారా రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, ఎలా మారుతున్నాయో గుర్తించారు.
* ఇపిఐ స్కానింగ్ 3 సెకన్ల గ్యాప్‌తో రిపీట్ చేయించారు.
* మొత్తంగా రెండు వందల సార్లు ఇపిఐ స్కాన్ చేయించారు. ఒకొక్కదానిని ఒకొక్క బ్లాక్‌గా నామకరణం చేసుకున్నారు. ఒకొక్క బ్లాక్ వ్యవధి 10 నిమిషాలు. వీటిలో 10 బ్లాకుల

నిండా ఓంకారం, 10 బ్లాకుల నిండా ఇస్..చప్పుడు, 20 బ్లాకుల నిండా ఇతర సమాచారం రికార్డయింది. ఏ టెన్షన్, డిప్రెషన్ లేని స్థితిలో మెదడు ఎలా పరమ ప్రశాంతంగా హాయిగా ఉందో ఓంకారం జపించేటప్పుడు.. జపించిన తర్వాతా..అలాగే ఉందని గుర్తించారు. పెద్దనరాన్ని కంపింపచేయడం ద్వారా శరీరంలోని అనేక ప్రాంతాలలో విశ్రాంత స్థితిని కలిగించింది.
ఇలా శరీరం, మెదడు పరమ ప్రశాంతంగా ఉండి, పూర్తి విశ్రాంతిని పొందుతుందని తేలింది. శరీరకంగా, మానసికంగా విశ్రాంతస్థితి చేకూరినందువల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందువల్ల రక్తపోటు బాధతప్పుతుంది. రక్తప్రసరణ సవ్యంగా ఉన్నందున గుండె, కాలే యం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఇలా అంతర్గత అవయవాలన్నీ సహజస్థితిలో ఉండి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. స్వరపేటిక స్పష్టంగా ఉండి ఎంత వయసొచ్చినా కంగుమంటూ ఉంటుంది. గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, ఊపిరి సంబంధ సమస్యలు, లివర్ సమస్యలు ఏవీ దరిజేరవు. కనుక ఓంకారం సాధనచేసే వారు ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చర్మకాంతి మెరుగుపడుతుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. కంటి చూపులో చురుకు పెరుగుతుంది. నీరసం, అలసట మాయమవుతాయి. ఎప్పుడూ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అంతా ఇంత బాగున్నప్పుడు షుగర్, బిపిలు కూడా దరిచేరకపోవడానికి ఆస్కారం ఉంది. మనసు, శరీరం బాగుంటే కావలసిందేముంది? ఇంగ్లీషువారు చెప్పే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్న లోకోక్తి ఓంకార సాధన విషయంలో నిజమవుతోంది.