Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

గాంధీ పిలుపిస్తే విరాళాల వరద

Over Rs 6,000 for Kerala Flood Relief is Mahatma Gandhi

అప్పట్లోనే రూ. 6 వేల సేకరణ

తిరువనంతపురం : దాదాపు వందేళ్ల క్రితం గాంధీజీ కేరళ వరద బాధితుల సాయం కోసం రూ 6000 సేకరించి అందించారు. 1924 జూలైలో కేరళలో భారీ వరదలు సంభవించాయి. అప్పట్లో అపార ప్రాణనష్ఠం, తీవ్రస్థాయి ఆస్తినష్టం జరిగింది. దీనిపై గాంధీజీ స్పం దన గురించి స్వాతంత్య్ర సమరయోధుడు , 104 ఏళ్ల అయ్యప్పన్ పిళ్లై ఇప్పుడు వెల్లడించారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు జరిగిన ఘటనలను తెలియచేశారు. కేరళలో విపత్తు అనూహ్య స్థాయిలో ఉందని, మలయాళీలను ఆదుకునేందుకు జాతి అంతా స్పం దించాలని గాంధీజీ తమ పత్రికలు యంగ్ ఇండియా, నవ్‌జీవన్‌లలో పలు వ్యాసాలను రాశారు. ఇందులో మలబార్‌ను ఆదుకునేందుకు మనమంతా కలిసికట్టుగా కదలాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఆయన పిలుపుతో దేశంలో భారీ స్థాయిలో ప్రజలు స్పందించారు. మహిళలు, పిల్లలు కూడా తమ వద్ద ఉన్నది విరాళాలుగా అందించారు. ఆడవారు తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని, పిల్లలు తమ చిన్న పొదుపు మొత్తాలను విరాళంగా పంపించారు. కొందరు   ఒక్క పూట భోజనాన్ని కూడా మానేసి పాలు కొనుక్కోవడం నిలిపివేసి ఆ విధంగా ఆదా అయిన డబ్బును విరాళాలుగా అందించారు. ఈ విధంగా మొత్తం  6994 రూపాయలు 13 అణాలు 3 పైసలు జమ అయినట్లు గాంధీ అప్పట్లో ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ బాధితులకు విరాళం కోసం ఒక చోట ఓ బాలిక మూడు పైసలు చోరీ చేసి తనకు పంపించిందని గాంధీ వెల్లడించారు. 1924లో వర్షాకాలంలో సంభవించిన వరదలతో మున్నార్, త్రిచూర్, కొజికోడ్, ఎర్నాకులం, అలువా, తిరువనంతపురం వంటి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికంటే భారీ స్థాయిలో నష్టం జరిగింది.1924లో జరిగింది మహా ప్రళయమే అని, పలు ప్రాంతాలలో అనేక రోజుల పాటు ప్రజలు కొండలపైనే తలదాచుకోవల్సి వచ్చిందని, ఈ దశలో గాంధీజీ  స్పందన  అంతా ఇంతా కాదని అయ్యప్పన్ తెలిపారు.

Comments

comments