Search
Thursday 15 November 2018
  • :
  • :

ఈ కోతి ఇప్పుడు సోషల్ మీడియా కింగ్.. ఎందుకంటే?

Overfed Thai monkey

సాధారణంగా ఒబెసిటి ఎవరికైనా వస్తుంది. దీంట్లో వింతేమి లేదు. కాని.. అదే ఒబెసిటి ఓ కోతికి వస్తే… అప్పుడు ఖచ్చితంగా అది న్యూసే. అవును. ఓ కోతి బీభత్సమైన ఒబెసిటితో బాధపడుతుంది.

Overfed Thai monkey

మీరు పైన చూసిన ఫోటో దానికి సంబంధించిందే. చూశారుగా… అనవసరమైన కొవ్వుతో ఎలా బాధపడుతుందో. అంత మోయలేని కొవ్వుతో ఉన్నా… తన తిండి ని మాత్రం ఆపట్లేదు చూశారుగా.

Overfed Thai monkey

బ్యాంకాక్ లోని ఓ మార్కెట్ లో ఉంటుంది ఈ ఫ్యాటీ మంకీ. అయితే.. అక్కడికొచ్చే టూరిస్టులు దానికి ప్రతి రోజు ఏదో ఒక ఆహారాన్ని ఇస్తుండేవాళ్లట. కొంతమందయితే.. ఏకంగా మిల్క్ షేకులు, నూడుల్స్ లాంటివి ఇవ్వడంతో రోజు రోజు దాని ఫ్యాట్ పెరుగుతూ వచ్చిందట.

Overfed Thai monkey

అంతే… చివరకు 15 కిలోల వరకు పెరిగి… ఇలా ఒబెసిటి కోతి లా మారిందట. ఇక.. ఇప్పుడు ఆ మార్కెట్ లో దీన్ని చూడటానికే స్పెషల్ గా యాత్రికులు వస్తుంటారట.

Overfed Thai monkey

అంత బరువు పెరిగి.. నడవడానికే ఎంతో కష్టపడుతున్నప్పటికీ… తన తిండిని మాత్రం ఆపట్లేదట ఆ కోతి. అక్కడి కొచ్చే టూరిస్టులు దానికి ముద్దుగా అంకుల్ ఫ్యాటీ అనే పేరు కూడా పెట్టారట.

Overfed Thai monkey

విషయం తెలుసుకున్న నేషనల్ పార్క్ డిపార్ట్ మెంట్…. వెంటనే దాన్ని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్ కు తరలించారట. ఇక.. దానితో ప్రతి రోజూ వ్యాయామాలు, పరుగులు చేయించి…కొవ్వు ను కరిగించే పనిలో పడ్డారట రెస్క్యూ సిబ్బంది.

Comments

comments