Home దునియా సింహంతో సహవాసం

సింహంతో సహవాసం

jamala-wildlife-lodgeఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జమాలా వైల్డ్‌లైఫ్ లాడ్జికి వెళ్తే వింత అనుభూతికి గురికావాల్సిందే. అక్కడంతా క్రూర జంతువులుంటాయి. వాటితో చక్కగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేయొచ్చు. అదేంటి అవేం చేయవా అంటారా? చేయలేవు. వాటికీ మనకూ మధ్య అడ్డుంటుంది.

స్థానికంగా ఉండే ‘రిచర్డ్ టిండేల్’ అనే వ్యాపారవేత్త కుటుంబం కొన్నేళ్ల కిందట ఈ జూని అభివృద్ధి చేసింది. 47 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ జూ మొత్తం రకరకాల చెట్లూ తోటలూ పొదలతో చిన్నపాటి అడవిలా కనిపిస్తుంది. దీన్నే జూ హోటల్ అని కూడా అంటారు. ఈ హోటల్లో మనుషులతో పాటు జంతువులు కూడా ఉంటాయి.

 

Overnight Sleepover at Australia National Zoo