Home పెద్దపల్లి పని చేయకుంటే ఇంటికే

పని చేయకుంటే ఇంటికే

Overwhelming corruption in the revenue

తీరుమారని ఉద్యోగులపై కలెక్టర్ కొరడా
ఒకే రోజు నలుగురిపై వేటు
రెవెన్యూలో మితిమీరిన అవినీతి

మనతెలంగాణ/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మంథని రాజయ్య సంవత్సరం క్రితం కూతురికి పెళ్లి చేశాడు. సంవత్పరం నుంచి ఇప్పటి వర కు కళ్యాణ లక్ష్మి డబ్బుల కోసం ముత్తారం తహసీల్దార్ కార్యా లయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అయినా ఇప్పటి వరకు పని కాలేదు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెం దిన గండు వెంకటేశం తనకు చెందిన పట్టా భూమిని భూప్ర క్షాళన సందర్బంగా రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరు ల పేరున మార్చారని, జరిగిన తప్పును సరిదిద్దాలని పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి వేసారిన ఆయ న కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆందోళన బాట పట్టాడు.పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న అవినీతికి మచ్చుతునకలు మాత్రమే ఈ సంఘటనలు. రోజుల తరబడి రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనికాక పోవడంతో ప్రతి సోమవారం జరిగే ప్ర జావాణికి వచ్చే ఫిర్యాదుల్లో సింహబాగం రెవిన్యూ విభాగానికి చెందినవి కావడం గమనార్హం. రెవెన్యూ విభాగంలో పెరిగి పో తున్న అవినీతి, నిర్లక్షంపై అగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జి ల్లా కలెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం సాయంత్రం నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. భూ రికార్డుల పరిశీలనలో నిర్లక్షం ప్రదర్శించడం, అవినీతికి పాల్పడడంతో మండలంలో రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ గా పని చే స్తున్న ఐ.శ్రీనివాస్‌ను, ముత్తారం మండలానికి చెందిన విఅర్‌ఒలు వెంకటరమణ, పి.శ్రీనివాస్‌ను, సంవత్సరం కా లంగా కళ్యాణలక్ష్మిదరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన జూనియర్ అసిస్టెంట్ యశ్వంత్‌లను సస్పెన్షన్ చేశారు. శుక్రవారం ఉదయం మంథని ముత్తారం తహసీల్దార్ కార్యా లయానికి క్షేత్రస్థా యి పరిశీలనకు వెళ్లిన జిల్లా జాయింట్ కలెక్టర్‌కు అదికారుల తీరుపై ఫిర్యాదు చేయడంతో, ని ర్వహించిన తనిఖీలో సంవత్సరం కాలంగా పెండింగ్‌లో ఉన్న కళ్యాణలక్ష్మిదరఖాస్తులు వెలుగులోకి వచ్చాయి. అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన జేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా క లెక్టర్ తక్షణమే ఉద్యోగులపై వేటు వేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా జనవరి లో బాద్యతలు చేపట్టిన శ్రీదేవసేన ఉద్యోగుల పట్ల సానుకూలంగానే ఉన్నారు. పనిచేయకుంటె చర్యలు తప్పవని ప లుమార్లు సున్నితంగా హెచ్చరించినా ఉద్యోగుల వైఖరిలో మార్పు రాకపోడంతో చర్యలు పూనుకున్నారు. కాళేశ్వరం,సింగరేణి భూసేకరణలో నిర్ణయించిన ధర కన్నా అధిక మొత్తం చెల్లించి భారి అవితీతికి పాల్పడ్డాడని ప్రాథమి విచారణలో తేలడంతో ఎకంగా పెద్దపల్లి ఆర్డివోను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అవినీతికి అలవాటుపడి విదుల పట్ల నిర్లక్షం వహిస్తున్న అధికారుల పైగడిచిన పక్షంరోజులుగాకలెక్టర్ కొరడాఝలిపిస్తుండడంప్లై ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.