Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘కాంచన-3’లో ఒవియా

ovia

రాఘవ లారెన్స్‌ను తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్‌గా నిలబెట్టిన చిత్రం ‘కాంచన’. సౌతిండియాలో హార్రర్ కామెడీ జోనర్‌కు గొప్ప డిమాండ్ తీసుకొచ్చిన సినిమా ఇది. ‘ముని’కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన కాంచన-2 చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు లారెన్స్ ‘కాంచన-3’ చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. కొన్ని రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. తమిళ ‘బిగ్ బాస్’తో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ఒవియా ఇందులో కథానాయికగా నటించనుంది. ‘బిగ్‌బాస్’ తర్వాత ఒవియాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. హర్రర్ కామెడీ జోనర్‌లో వస్తున్న ‘కాంచన-3’తో మరో హిట్‌ను అందుకోవాలని అనుకుంటున్నాడు లారెన్స్.

Comments

comments