Search
Monday 24 September 2018
  • :
  • :

చైనా బిజినెస్ స్కూల్ అధిపతిగా భారతీయుడు

China-School-Business

బీజింగ్: అమెరికాలో ప్రముఖ భారతీయ ప్రొఫెసర్ అయిన దీపక్ జైన్ చైనాలో ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ స్కూలు కొత్త అధిపతిగా నియమితులైనారు.28 ఏళ్లుగా షాంఘైలోని చైనా యూర ప్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూలు చీఫ్‌గా ఉండిన పెడ్రో న్యూనో స్థానంలో ఆయన ఈ కొత్త బాధ్యతలు చేపడతారు. 61ఏళ్ల జైన్ గతంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కెల్లోగ్ సూకల్ ఆఫ్ మేనేజిమెం ట్, ఐఎన్‌ఎస్‌ఇఎడిలకు డీన్‌గా పని చేశారు.చైనా యూరప్ ఇంటర్నేషనల్ బిజినెస్ చీఫ్‌గా ఉన్న చైనాకు చెందిన లీ మింగియున్‌తో కలిసి ఆయన పని చేస్తారు. కొత్త పదవి తాను ఇప్పటివరకు బైటినుంచి మాత్రమే చూసిన చైనాపై లోతుగా అధ్యయనం చేయడానికి తనకు అవకాశం కలిస్తుందని ఆయన అన్నారు. అసోంలో పుట్టిన జైన్ చికాగోలో నివసిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో సిఇఐబిఎస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఆయన నెలకు పదినుంచి 15 రోజుల పాటు షాంఘైలో పని చేస్తున్నారు.

Comments

comments