Home జాతీయ వార్తలు ఆక్సిజన్ కొరత : ముగ్గురు శిశువులు మృతి

ఆక్సిజన్ కొరత : ముగ్గురు శిశువులు మృతి

Oxygen Shortage: Three Babies Died

లక్నో : యుపి రాజధాని లక్నోలో ఉన్న కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో ముగ్గురు శిశువులు చనిపోయారు. ఒకే ఆక్సిజన్‌ సిలిండరు ను నలుగురు చిన్నారులకు ఉపయోగించడంతో వారికి శ్వాస సరిగా అందక ముగ్గురు శిశువులు చనిపోయారు. తీవ్ర అస్వస్థతకు లోనైన నలుగురు శిశువులను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ పరిధిలోని పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పిఐసియు)లో చేర్పించారు. ఆస్పత్రి సిబ్బంది ఈ నలుగురు శిశువులకు ఒకే ఆక్సిజన్ సిలిండర్‌ను ఉపయోగించారు. ఈ క్రమంలో ఆక్సిజన్ సరిపోక ముగ్గురు శిశువులు మృతిచెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్షం వల్లనే తమ పిల్లలు చనిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Oxygen Shortage: Three Babies Died