Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

‘బొమ్మరిల్లు’లా ‘ఓయ్.. నిన్నే’

Oy-Ninne

మన సంతోషానికి దగ్గరగా ఉన్నప్పుడే మనం సుఖంగా ఉంటామని నమ్మే ఓ కుర్రాడు విష్ణు. కాలేజీలోని ఓ అమ్మాయితో అతను ప్రేమలో పడతాడు. ఓ దశలో ప్రేమ? కుటుంబమా?… రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంపిక చేసుకోమని అంటుంది అమ్మాయి. అప్పుడతను ఏం చేశాడనే కథతో రూపొందిన సినిమా ‘ఓయ్.. నిన్నే’. భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ “దర్శకుడు సత్య చల్లకోటికి ఇది మొదటి చిత్రమే అయినా అనుభవమున్న దర్శకుడిలా ‘ఓయ్.. నిన్నే’ను తీర్చిదిద్దాడు. తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయ భేదాలు, బావా మరదళ్ల మధ్య ప్రేమ కథ చిత్రానికి హైలైట్. భరత్, సృష్టిలు కొత్తవాళ్లయినా అద్భుతంగా నటించారు”అని అన్నారు. దర్శకుడు సత్య చల్లకోటి మాట్లాడుతూ “కుటుంబ కథా చిత్రమిది. ఇందులో హీరోది ముక్కు సూటి మనస్తత్వం. మనసులో మాటను ఎదుటి వ్యక్తి మొహం మీదే చెప్పేస్తుంటాడు. అతనికిది కొన్నిసార్లు ప్లస్ అయితే… ఇంకొన్ని సార్లు మైనస్ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో అతనికి ఎలాంటి అభిప్రాయ భేదాలు వచ్చాయి? మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు? అనేది చిత్ర కథ. ‘బొమ్మరిల్లు’లా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది”అని అన్నారు. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్, తులసి, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరాః సాయి శ్రీరామ్, సంగీతంః శేఖర్ చంద్ర, ఎడిటింగ్‌ః మార్తాండ్ కె.వెంకటేష్, పాటలుః రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌ః వెంకట్.

Comments

comments