Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

2 వేల నోటులో పి32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందంట?

NEW-NOTE

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తరువాత విడుదల చేసిన 2వేల నోటుపై ఎన్నో ఆసక్తి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నోటులో జిపిఎస్ ఆధారిత మైక్రోచిప్ పెట్టారని, ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ఎవరి వద్ద ఉన్నా ఇట్టే తెలిసిపోతుందన్న ప్రచారం జరిగింది. అయితే అదంతా ఓ కట్టుకథ అని తేలిపోయింది.

ఇదిలా ఉండగాఈ నోటు గురించి ఓ కొత్త విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఈ నోటులో పి32 అనే రేడియోధార్మిక ఫాస్పరస్ ఐసోటోప్ ఉందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నోటును ముద్రించడానికి రేడియోధార్మిక ఇంకు ఉపయోగించారని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

ఢిల్లీ, చెన్నయ్, వెల్లూరు, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో సరిగ్గా ఎక్కడైనా పెద్ద మొత్తంలో 2 వేల దాచి పెట్టారో అక్కడే ఐటి శాఖ అధికారులు సోదాలు చేసి, వాటిని పట్టుకోవడంతో ఆ తర్వాతి నుంచి ఈ రేడియో ధార్మిక ఇంకుకు సంబంధించిన కథనాలు అధికంగా వస్తున్నాయి. ఒకేచోట ఎక్కువగామొత్తంలో ఈ పి32 అనే పదార్థం ఉంటే వెంటనే తెలిసిపోతుందని, అందువల్లనే పెద్ద మొత్తంలో నోట్లు ఉన్న చోట దాడులు జరుగుతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఈ నోటులో ఉన్న ఈ రేడియోధార్మిక పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెపుతుండడం గమనార్హం. ఈ నోటు తయారీ విషయంలో రెగ్యులర్‌గా ఉండే సెక్యూరిటీ ఫీచర్లే తప్ప ఎలాంటి అదనపు ఫీచర్‌ను చేర్చలేదని ఆర్‌బిఐ వెల్లడించిన విషయం తెలిసిందే. నోటు ముద్రణకు రేడియోధార్మిక ఇంక్ వాడారన్నది కూడా ఉత్తుత్తి ప్రచారమేనని ఆర్‌బిఐ వర్గాలు తెలిపాయి.

Comments

comments