Home జాతీయ వార్తలు ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా బుగ్గన

ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా బుగ్గన

AP,-PAC ఎపి శాసన సభ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌గా వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని సోమవారం స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల పిఎసి ఛైర్మన్ పదవికి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆయన నియామకాన్ని ప్రకటించారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ప్రవేశం చేసిన రాజేంద్రనాథరెడ్డి కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.